- Telugu News Photo Gallery Cinema photos Do You Know This Heroine Who Is Acted In Saiyaara Movie, Now She Is Latest National Crush, She is Aneet Padda
Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!
ఈమధ్యకాలంలో సినిమాల్లోకి కొత్త కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటూ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతున్నారు. అలాగే అందం, అభినయంతో కట్టిపడేస్తున్నారు. తాజాగా ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా స్టార్ హీరోనే ఫ్లాట్ చేసేసింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా..
Updated on: Jul 23, 2025 | 1:48 PM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఓ సినిమా సంచలనం సృష్టిస్తుంది. ఆ సినిమాతో 22 ఏళ్ల హీరోయిన్ రికార్డ్స్ తిరగరాస్తుంది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆ ముద్దుగుమ్మకు ఏకంగా మహేష్ బాబు సైతం ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో తెలుసా.. ?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు అనీత్ పద్ద. వయసు 22 సంవత్సరాలు. పంజాబ్ లోని అమృత్ సర్ లో జన్మించిన ఈ వయ్యారి.. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన సయ్యారా సినిమాతో కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. జూలై 18న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది అనీత్ పద్ద. అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది.

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఈ అమ్మడు గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అనీత్ పద్ద.. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చేస్తుందట. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది అనీత్ పద్ద. ఇప్పటికే పలు యాడ్స్ చేసింది.

ఇక సయ్యారా సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే ఊహించని విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఈ సుందరి.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇటీవల సయ్యారా సినిమాపై మహేష్ బాబు సైతం ప్రశంసలు కురిపించారు. అలాగే హీరోహీరోయిన్స్ పై పొగడ్తలు కురిపించారు.




