- Telugu News Photo Gallery Cinema photos Raashii Khanna Acting With Pawan Kalyan In Ustaad Bhagat Singh Movie
Pawan Kalyan: పవన్ సరసన మరో హీరోయిన్.. ఆ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న అందాల రాశి..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జూలై 24న ఈ సినిమా విడుదలవుతుండగా.. అటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ అంటూ క్షణం తిరిక లేకుండా గడిపేస్తున్నారు. మరోవైపు పవన్ కొత్త సినిమాలపై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తున్నాయి.
Updated on: Jul 23, 2025 | 1:21 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అటు రాజకీయాలు.. ఇటు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. తాజాగా పవన్ కొత్త సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. అదెంటంటే..

పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ప్రస్తుతం ఈ ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. తాజాగా మరో హీరోయిన్ సైతం ఈ మూవీలో భాగమైనట్లు మేకర్స్ ప్రకటించారు.

ఆమె మరెవరో కాదు.. రాశీ ఖన్నా. ఈ చిత్రంలో రాశి భాగమైనట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని మేకర్స్ సైతం కన్ఫార్మ్ చేస్తూ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆమె శ్లోక పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు.

తన పాత్రతో సినిమాకు మరింత అందాన్ని తెస్తుందన్నారు. ప్రస్తుతం ఆమె షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలిపారు. అయితే ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అలరించిన రాశీఖన్నా.. కొన్నాళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది.

హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. ఇక చాలా కాలం తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది ఈ అమ్మడు.




