AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది టాలీవుడ్ హీరోయిన్. ఇప్పటివరకు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. కొన్నాళ్లుగా తెలుగు సినిమాల్లో సైలెంట్ అయ్యింది. ఇప్పుడు ఆమె పూర్తిగా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: Jul 23, 2025 | 2:15 PM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసిన అందాల రాక్షసి. ఎలాంటి గ్లామర్ షో లేకుండా వరుస సినిమాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీలో నటిస్తుంది. ఇటీవలే తెలుగులో ఓ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత హిందీలో అవకాశాలు అందుకుంటూ అక్కడే బిజీగా ఉండిపోయింది. చాలా కాలంగా సోషల్ మీడియాలో చాలా సైలెంట్ అయిన ఈ వయ్యారి.. ఇప్పుడు క్రేజీ ఫోటోస్ షేర్ చేసింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? కెరీర్ తొలినాళ్లల్లో ఆమె సైడ్ ఆర్టిస్ట్.. సైడ్ డ్యాన్సర్. కానీ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. ఈ హీరోయిన్ మరెవరో కాదండి.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. చాన్నాళ్లకు నెట్టింట ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది.

ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి, విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలతో నటిగా ప్రశంసలు అందుకున్న సాయి పల్లవి.. ఇటీవలే తండేల్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. అక్కినేని నాగచైతన్య, డైరెక్టర్ చందూ మొండేటి కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం సాయి పల్లవి హిందీలో రామాయణ్ చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ నితీశ్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో రాముడిగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తుండగా.. సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. అలాగే ఈ మూవీలో యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి

కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. ఇటీవల విడుదలైన గ్లింప్స్ మూవీపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం సాయి పల్లవి దాదాపు రూ.6 కోట్లు తీసుకుంటుందట. మొత్తం రూ.4500 కోట్లతో ఈ సినిమాను రెండు భాగాలుగా నిర్మించనున్నారు.

Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..

Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..

Telugu Cinema: టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‏గా.. ఎవరంటే..

Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..