నాడు నైట్ వాచ్‌మెన్‌గా జీతం రూ.165… నేడు.. కోట్లు సంపాదిస్తున్న నటుడు
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది గతంలో నానా తిప్పలు పడివచ్చిన వారే. వీరిలో కొందరు పొట్ట కూటి కోసం చిన్న చితకా ఉద్యోగాలు చేసిన వారే. అలాంటి వారిలో శాయాజీ షిండే కూడా ఒకరు. మహారాష్ట్రలోని ఒక కుగ్రామంలోని సన్నకారు రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన షిండే.. చదువుకోసం బాల్యంలోనే సొంతూరును వదిలేశారు.
చదువుకునే రోజుల్లో తల్లిదండ్రులను డబ్బు అడిగే అవకాశం లేకపోవటంతో పగలు కాలేజీకి వెళ్లి రాత్రి నైట్ వాచ్ మెన్ జాబ్ చేశాడు. అలా నైట్ డ్యూటీ చేసినందుకు నెలకు తనకు వచ్చే.. 165 రూపాయిలలో రూ. 150 ఇంట్లో ఇచ్చి, మిగిలిన పదిహేను రూపాయలను తన ఖర్చులకి ఉంచుకునే వారు. అదే సమయంలో నటనపై ఆసక్తితో తన దగ్గర ఉన్న కొద్ది పాటి డబ్బుతో ముంబై వెళ్లి యాక్టింగ్ నేర్పే వర్క్‌షాపులకు హాజరయ్యేవాడు. చదువు కాగానే.. నటనలోనూ ట్రైనింగ్ తీసుకున్నాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అతి గొప్ప నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు షిండే. అంతేకాదు..మనదేశంలో అధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగానూ నిలిచారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లిష్, భోజ్ పురీ, మరాఠీ, గుజరాతి భాషల్లోనూ స్టార్ నటుడిగా వెలుగొందుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు షిండే. అందులో తన యాక్టింగ్, అలాగే తన వాయిస్ కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. దీని తర్వాత పలు హిట్ సినిమాల్లోనూ నటించి మెప్పించాడు షిండే. పోకిరి,అతడు, రాఖీ,నేనింతే,కింగ్, అదుర్స్ తదితర చిత్రాలు షిండేకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. తెలుగులో దాదాపు అందరు హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇప్పటికీ తెలుగుతో పాటు పలు భాషల్లోనూ నటుడిగా రాణిస్తున్న షిండే నిరుడు రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. తన సొంత నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని రూమర్లు వచ్చినా.. అదేమీ జరగలేదు. ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు షిండే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగుళూర్ గుహలో పిల్లలతో రష్యన్ మహిళ.. వివరాల్లోకి వెళ్లగా ఖంగుతిన్న పోలీసులు..
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్‌ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్‌లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

