AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kingdom : ఓవర్సీస్ ప్రీమియర్స్‏లో కింగ్‏డమ్ రికార్డ్.. సత్తా చాటుతున్న విజయ్ దేవరకొండ..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘కింగ్‌డమ్’. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ అటు యూట్యూబ్‏లో రికార్డ్స్ బద్దలుకొడుతూ దూసుకుపోతుంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ కింగ్ డమ్ జోరు కొనసాగుతుంది.

Kingdom : ఓవర్సీస్ ప్రీమియర్స్‏లో కింగ్‏డమ్ రికార్డ్.. సత్తా చాటుతున్న విజయ్ దేవరకొండ..
Kingdom Film
Rajitha Chanti
|

Updated on: Jul 30, 2025 | 7:31 AM

Share

విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న తాజా చిత్రం కింగ్‌డమ్. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ద్వారా ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఇటీవల విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డ్స్ బద్దలుకొడుతుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉండడంతో అడ్వాన్స్ బుకింగ్స్‏లో దుమ్మురేపుతుంది. బుక్ మై షోలో ఇప్పటికే లక్షకు పైగా టికెట్స్ అమ్ముడైనట్లు మేకర్స్ తెలిపారు. ఇక యూఎస్‏లో 30వ తేదీనే ప్రీమియర్ షోలు పడనుండగా.. ఇప్పటికే అక్కడ 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయట. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అలాగే కెనడాలో 1534 లకు పైగా టికెట్స్ సేల్ అయినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ సినిమాపై ఏ రేంజ్ అంచనాలు నెలకొన్నాయో అర్థమవుతుంది.

ఇవి కూడా చదవండి

చాలా కాలం తర్వాత ఈ సినిమాలో విజయ్ మాస్ అండ్ రగ్గడ్ లుక్‏లో కనిపించనున్నారు. ట్రైలర్ లో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ మధ్య వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకున్నాయి. అభిమానులు కోరుకుంటున్న విజయం కింగ్ డమ్ సినిమాతో రాబోతుందని ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకలో అన్నారు విజయ్ దేవరకొండ.

ఇవి కూడా చదవండి.. 

Movie: 13 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ సెన్సేషన్ ఈ సినిమా.. చూస్తూ వణికిపోయిన జనాలు..

Tollywood: ఇండస్ట్రీలోకి ఫ్లాప్ హీరోయిన్.. హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ.. కానీ కాలు కదపాలంటే కోట్లు ఇవ్వాల్సిందే..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..