AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: మన దేశం ముందుకు పోతున్నట్లే.. 66 ఏళ్ల వయసులో ప్రెగ్నెన్సీపై నటి ఏమన్నదంటే?

నిజం చెప్పాలంటే ఈ నటి పెళ్లి చేసుకోకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో సింగిల్ మదర్ గానే బిడ్డను పెంచి పెద్దది చేసింది. అయితే కూతురు పెద్దయ్యాక మళ్లీ 2008లో రెండో వివాహం చేసుకుందీ అందాల తార.

Actress: మన దేశం ముందుకు పోతున్నట్లే.. 66 ఏళ్ల వయసులో ప్రెగ్నెన్సీపై నటి ఏమన్నదంటే?
Bollywood Actress
Basha Shek
|

Updated on: Mar 14, 2026 | 6:55 AM

Share

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా వెడ్డింగ్ రిసెప్షన్ కు అతిరథ మహారథులు తరలివచ్చారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్.. ఇలా అన్ని పరిశ్రమల తారలందరూ ఈ రిసెప్షన్ పార్టీకి వచ్చారు. నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరలయ్యాయి. అయితే ఇదే విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా, భర్త వివేక్‌తో కలిసి హాజరైంది. స్టైలిష్‌గా తెల్ల చీర కట్టుకుని, మెడకు బంగారు నెక్లెస్‌ ధరించి వచ్చిన ఆమె విరోష్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆమె కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరలయ్యాయి. అయితే ఈ వేడుకలో నీనా గుప్తా పొట్ట ఎత్తుగా కనిపించడంతో అది బేబీ బంప్ అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. 66 ఏళ్ల వయసులో నీనా తల్లికాబోతోందంటూ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోలింగ్ జరుగుతోది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

తన పై సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారంపై నీనా గుప్తా స్పందించారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. నేను గర్భవతిని కాదు, నేను ధరించిన ఐవరీ చీర ఫ్యాబ్రిక్ చాలా మందంగా ఉంది. దానిని కట్టుకోవడం వల్ల నేను కాస్త బొద్దుగా కనిపించాను. దానిని చూసి నేను గర్భం ధరించానని భావించడం ఆశ్చర్యంగా ఉంది. ఈ పుకార్లు నన్ను బాధించడానికి బదులు, నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ వయసులో ప్రెగ్నెంట్‌ అనుకున్నారంటే మన దేశం ముందుకు పోతున్నట్లే’ అని సెటైరికల్ కామెంట్స్ చేశారీ అందాల తార.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న నటి వీడియో ఇదిగో..

నీనా గుప్తా పెళ్లి చేసుకోకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 1980లో, నీనా గుప్తా అప్పటి వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో ప్రేమలో మునిగి తేలింది. వీరిద్దరికి ఒక కూతురు కూడా పుట్టింది. అయితే ఆ తర్వాత వివిధ కారణాలతో వీరు పెళ్లి చేసుకోలేదు. దీంతో సింగిల్ మదర్ గానే బిడ్డను పెంచి పోషించారు నీనా గుప్తా. ఈ క్రమంలోనే సమాజం నుంచి ఆమెకు తీవ్ర అవమానాలు ఎదురయ్యాయి. కూతురు మసాబాను పెంచి పెద్ద చేసిన నీనా 2008లో వివేక్‌ మెహ్రాను వివాహం చేసుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బంగారం ధరలు మరోసారి ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
బంగారం ధరలు మరోసారి ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
IND vs PAK: ఒకట్రెండు కాదు.. ఏకంగా 3 మ్యాచ్‌‌ల్లో భారత్, పాక్ ఢీ
IND vs PAK: ఒకట్రెండు కాదు.. ఏకంగా 3 మ్యాచ్‌‌ల్లో భారత్, పాక్ ఢీ
విశ్వవిఖ్యాత జగన్నాథ రథయాత్ర నేడు మహా వైభవంగా ప్రారంభం.. రవి యోగం
విశ్వవిఖ్యాత జగన్నాథ రథయాత్ర నేడు మహా వైభవంగా ప్రారంభం.. రవి యోగం
5 ఏళ్ల క్రితమే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఫలితంపై జోస్యం..
5 ఏళ్ల క్రితమే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఫలితంపై జోస్యం..
తమకు స్వాతంత్ర్య దొరికిందంటూ బలూచ్‌ల ప్రకటన! పాక్, చైనాకు..
తమకు స్వాతంత్ర్య దొరికిందంటూ బలూచ్‌ల ప్రకటన! పాక్, చైనాకు..
రూ.400 చెల్లిస్తే చాలు.. ఆన్‌లిమిటెడ్ వైఫై ఫ్రీ..
రూ.400 చెల్లిస్తే చాలు.. ఆన్‌లిమిటెడ్ వైఫై ఫ్రీ..
భర్తను గుడికి తీసుకెళ్లింది.. బాయ్ ఫ్రెండ్‌తో కలిపి లేపేసింది..
భర్తను గుడికి తీసుకెళ్లింది.. బాయ్ ఫ్రెండ్‌తో కలిపి లేపేసింది..
నమ్మక ద్రోహానికి బుద్ధితో సమాధానం.. కోతి- మొసలి నీతి కథ
నమ్మక ద్రోహానికి బుద్ధితో సమాధానం.. కోతి- మొసలి నీతి కథ
మీ పేరుపై ఎవరైనా లోన్ తీసుకున్నారా..? ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి
మీ పేరుపై ఎవరైనా లోన్ తీసుకున్నారా..? ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి
జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..
జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..