Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..
ప్రస్తుతం సీనియర్ హీరోలు సైతం కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సినీప్రియులను అలరిస్తున్నారు. నిత్యం కొత్త కొత్త కథలతో అడియన్స్ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా ఇండస్ట్రీలోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇంతకీ ఈ సినిమా పేరు తెలుసా.. ?

దశాబ్దాలుగా సినీరంగంలో సత్తా చాటుతున్న ఓ హీరో.. ప్రస్తుతం 74 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. అయితే ఈ స్టార్ హీరో నటించిన ఓ సినిమా థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. కంటెంట్, దర్శకత్వం, యాక్టింగ్ పై విమర్శకులు సైతం ప్రశంసుల కురిపించారు. కానీ ఈ మూవీ విడుదలైన సమయంలో నెట్టింట హీరోహీరోయిన్ ఏజ్ గ్యాప్ గురించి పెద్ద చర్చే నడిచింది. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ వయసు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. ఇక హీరో వయసు ఆ సినిమా సమయానికి 65 ఏళ్లు. అంటే ఇద్దరి మధ్య 35 సంవత్సరాల వ్యత్యాసం ఉందన్నమాట. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ?
మనం మాట్లాడుకుంటున్న సినిమా మరెదో కాదండి.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి. రూ.100 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. 2016లో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాత కళైపులి ఎస్.థాను నిర్మించారు. కబాలి అనే పైబడిన గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత తన శత్రువుల పై ఎలా పగ తీర్చుకున్నాడు అనేది సినిమా. తన భార్య, కూతురి కోసం వెతకడం.. అదే సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది సినిమా. ఈ సినిమాలో రజినీ భార్యగా రాధికా ఆఫ్టే కథానాయికగా నటించింది. అప్పుడు ఆమె వయసు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. ఈ సినిమా మొత్తం పదివేల స్క్రీన్ లలో విడుదలై రికార్డ్స్ సృష్టించింది.
ఇవి కూడా చదవండి: Damarukam movie: ఢమరుకం మూవీ విలన్ గుర్తున్నాడా.. ? అతడి భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్..
Shopping Mall : షాపింగ్ మాల్ సినిమాలో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఇప్పుడేం చేస్తుందంటే..

Kabali Movie
Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..








