AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‏లో పనిచేసిన ఏకైక నటుడు.. ఎవరో తెలుసా.. ?

దక్షిణాది చిత్రపరిశ్రమలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్న చాలా మంది ఒకప్పుడు వేరే రంగాల్లో పనిచేసినవారే. కానీ మీకు తెలుసా.. ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక నటుడు భారత వైమానిక దళంలో పనిచేశారు. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఇంతకీ ఆ నటుడు ఎవరు.. ? అనే విషయాలు తెలుసుకుందాం.

Actor: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‏లో పనిచేసిన ఏకైక నటుడు.. ఎవరో తెలుసా.. ?
Delhi Ganesh
Rajitha Chanti
|

Updated on: Jul 31, 2025 | 7:45 AM

Share

సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఢిల్లీ గణేష్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అద్భుతమైన నటనతో జనాల హృదయాలు గెలుచుకున్నారు. 1976లో విడుదలైన ‘పట్టిన ప్రవేశం’తో ప్రారంభించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వం వహించారు. సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టకముందు ఆయన 1964 నుంచి 1974 వరకు భారత వైమానిక దళం (Indian Air Force)లో పనిచేశారు. కానీ చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో తన పదవికి రాజీనామా చేసి సినీరంగంలోకి అడుగులు వేశారు. అదే సమయంలో ఢిల్లీలో ఉన్న థియేటర్ గ్రూప్ అయిన దక్షిణ భారత్ నాటక సభ ఆయన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సహాయపడింది. కెరీర్‌లో హీరో నుండి విలన్ వరకు విభిన్న పాత్రలను పోషించి, నటుడిగా తన అద్భుతమైన నటనతో మెప్పించారు.

ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించారు. ఆయన ‘ఎంగమ్మ మహారాణి’ (1981)లో కథానాయకుడిగా నటించారు. తరువాత ‘అపూర్వ భ్రాంతనాల్’లో ప్రతినాయక పాత్రను పోషించారు. ‘నాయగన్’ (1987), ‘మైఖేల్ మదన కామ రాజన్’ (1990), ‘అపూర్వ సగోదరర్గల్’ (1989), ‘తెనాలి’ (2000) మరియు ‘ధృవంగల్ పతినారు’ (2016) వంటి చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలే కాకుండా బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఫేమస్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి..Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‏లో అందాల రచ్చ..

1979లో పాసి చిత్రానికి తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకున్నారు. కెరీర్ మొత్తంలో ఎన్నో ఐకానిక్ పాత్రలు పోషించిన ఆయన చివరిసారిగా కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 చిత్రంలో నటించారు. గతేడాది నవంబర్ 11న రాత్రి నిద్రలోనే కన్నుమూశారు.

Delhi Ganesh Movies

Delhi Ganesh Movies

Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..

Actress : మహేష్ బాబుతో ఫస్ట్ మూవీ.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డ్..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..