AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pallavi Prashanth: ‘ఇంత బతుకు బతికి చివరకు’.. బోరున ఏడ్చేసిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఒక అనామకుడిగా పాల్గొన్నాడు పల్లవి ప్రశాంత్. మొదట అతనిని చూస్తే ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేడనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా రైతు బిడ్డ ట్యాగ్ తో ఏకంగా బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి సంచలనం సృష్టించాడు పల్లవి ప్రశాంత్.

Pallavi Prashanth: 'ఇంత బతుకు బతికి చివరకు'.. బోరున ఏడ్చేసిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. ఏం జరిగిందంటే?
Pallavi Prashanth
Basha Shek
|

Updated on: Jul 31, 2025 | 9:10 AM

Share

బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కసారైనా వెళ్లిరావాలన్నది చాలా మంది కల. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కూడా. అలాంటి కలను నెరవేర్చుకోవడమే కాకుండా ఏకంగా విన్నర్‌గా నిలిచాడు పల్లవి ప్రశాంత్. ఒక కామన్ మ్యాన్ గా హోస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతను ఏకంగా బిగ్‌బాస్ విజేతగా బయటికి తిరిగొచ్చాడు. రైతు బిడ్డ ట్యాగ్ తో బుల్లితెర అభిమాను గెల్చుకుని బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ విజేతగా అవతరించాడు. అయితే బిగ్ బాస్ ట్రోఫీ గెలిచిన ఆనందం కొద్ది గంటల్లోనే ఆవిరైంది పల్లవి ప్రశాంత్ కు. గ్రాండ్‌ ఫినాలే రోజు రాత్రి అన్నపూర్ణ స్టూడియో బయట కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆర్టీసీ బస్సు కూడా ధ్వంసమైంది. దీంతో పోలీసులు బిగ్‌బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని తమ్ముడిపై కూడా కేసు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో భాగంగా కొద్ది రోజులు జైలు జీవితం కూడా గడిపాడు ప్రశాంత్. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇప్పుడిదే సంఘటనను మళ్లీ గుర్తు చేసుకున్నాడు రైతు బిడ్డ. ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతను చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ఇంత బతుకు బతికి.. మా నాన్నను కోర్టు మెట్లు ఎక్కేలా చేశానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజు జరిగిన సంఘటన తలచుకుంటే నాకు ఇప్పటికీ బాధగానే ఉందని భావోద్వేగానికి లోనయ్యాడు.

ఇవి కూడా చదవండి

‘ఆ గొడవ ఎవరు చేశారో నాకు తెలియదు. కానీ ఎవరైనా సరే కర్మ వారిని వదిలిపెట్టదు. నేను జైలుకు వెళ్లి నాలుగు రోజులు ఉన్నాను. అక్కడ బిగ్ బాస్ లో ఎవరు విజేత అంటూ నన్నే అడగడం తట్టుకోలేకపోయాను. నేను జైలుకు వెళ్లడంతో మానాన్న బెయిల్ కోసం కోర్టు మెట్ల దగ్గర పడుకోవడం నేను ఎప్పటికీ మర్చిపోలేను.’ అంటూ ఎమోషనల్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరలవుతోంది.

సోనియా ఆకుల సీమంతంలో పల్లవి ప్రశాంత్..

కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని టీవీ షోస్ , ప్రోగ్సామ్స్, ఈవెంట్స్ లోనూ కనిపించాడు పల్లవి ప్రశాంత్. సినిమా ఛాన్సులు కూడా వచ్చాయని ప్రచారం జరిగినా ఇప్పటివరకు ఒక్కటి కూడా పట్టాలెక్కలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి