OTT Movie: మంత్రగత్తెను నమ్మితే.. ఓటీటీనిషేక్ చేస్తోన్నలేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్
ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ మిస్టీరియస్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇటీవలే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చింది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఒళ్లు గగుర్పొడిచే సీన్లు, దిమ్మతిరిగే ట్విస్టులతో ఆద్యంతం ఈ సిరీస్ ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. అందుకే ఇది ప్రస్తుతం ఓటీటీలో టాప్ ప్లేస్ లో నిలిచింది

ఇప్పుడు చాలా మంది ఓటీటీల్లోనే తమకు ఇష్టమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూడటానికి ఆసక్తి చపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఆసక్తికరమైన సిరీస్ లు, సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అలా గత వారాంతంలో కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీల్లోకి వచ్చాయి. అందులో ఒక వెబ్ సిరీస్ మాత్రం ఓటీటీ ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. క్షణ క్షణం ఉత్కంఠ రేపే సన్నివేశాలు, దిమ్మ తిరిగే ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఈ సిరీస్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సిరీస్ గురించి చాలా చర్చ జరుగుతోంది. జులై 25న స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠగా ముందుకు సాగుతుంది. సస్పెన్స్, క్రైమ్, హారర్, ఇన్వెస్టిగేషన్ ఇలా అన్నీ అంశాలు ఉండడంతో ఈ సిరీస్ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. ఇక కథ విషయానికి వస్తే.. ఉత్తర ప్రదేశ్ లోని చరణ్ దాస్ పూర్ పట్టణంలో 1952లో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. అడవికి దగ్గరలో ఉన్న ఒక మంత్రగత్తె రహస్యంగా క్షుద్రపూజలు చేస్తుంటుంది. ఎవరికైనా కోరికలు ఉంటే వారి బొటనవేలు సమర్పిస్తే కోరికలు తీరుతాయని అందరినీ నమ్మిస్తుంటుంది. మంత్రగత్తె మాటలు నమ్మిన చాలామంది గ్రామస్థులు అక్కడకు వెళ్లి బొటనవేలు సమర్పిస్తుంటారు. అదే సమయంలో కొందరు గ్రామస్తులు ఈ విషయం తెలుసుకుని కలిసికట్టుగా అడవి నుంచి మంత్రగత్తెను తరిమేస్తారు.
బొటన వేలు సమర్పిస్తే..
ఇదే టైంలో ఆ ఊరి నుంచి వెళ్లిపోయిన విక్రమ్ అనే వ్యక్తి ఢిల్లీ వెళ్లి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. కానీ కొన్ని కారణాలతో సస్పెన్షన్ కు గురవుతాడు. దీంతో సొంతూరికి వస్తాడు. అక్కడ తన తమ్ముడు, పిన్నిని అడవికి తీసుకెళ్లిన తన తల్లి అదృశ్యం అయ్యిందని తెలుసుకుని వారిని వెతకడం ప్రారంభిస్తాడు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఒక మహిళా CID అధికారిని రాష్ట్రానికి పిలుస్తారు. ఇదే క్రమంలో గ్రామంలో వరసగా హత్యలు జరుగుతాయి. మృతదేహాలపై డిఫరెంట్ సింబల్స్ కూడా ఉంటాయి. మరి ఈ హత్యలకు కారణమెవ్వరు? విక్రమ్ కుటుంబ సభ్యులు ఏమయ్యారు? గతంలో ఊరి నుంచి తరిమివేసిన మంత్ర గత్తెకు ఈ హత్యలకు ఏమన్నా సంబంధముందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
వరుస హత్యల వెనక మిస్టరీ ఏంటి?
ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘మండల మర్డర్స్’. హీరోయిన్ వాణి కపూర్‌తో పాటు సుర్వీన్ చావ్లా, వైభవ్ రాజ్ గుప్తా, శ్రియా పిల్గావ్‌కర్ తదితరులు నటించారు. ఈ సిరీస్‌లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి.ఆసక్తికరమైన కంటెంట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగాఉండడంతో ఈ వెబ్ సిరీస్ OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. ప్రతి ఎపిసోడ్ లోనూ అనూహ్య మలుపులు, క్లైమాక్స్ ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ రెండవ సీజన్ కూడా రావాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే సిరీస్ నిర్మాతలు రెండవ సీజన్ గురించి ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.
Mandala ke khel mein ab aapki baari hai. Mol chukane ka waqt aa gaya hai 👀🕸️ Watch Mandala Murders, out now, only on Netflix.#MandalaMurdersOnNetflix pic.twitter.com/9XHvY10cqh
— Netflix India (@NetflixIndia) July 25, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .








