OTT Movie: అడవిలో వరుసగా అమ్మాయిల మిస్సింగ్.. ఓటీటీలోకి మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
1998లో ఓ మారుమూల గ్రామంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ క్రైమ్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించడం విశేషం. అలాగే రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇప్పుడు తెలుగులోనూ వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. లవ్, కామెడీ, యాక్షన్, హారర్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్.. ఇలా అన్ని జానర్లకు చెందిన సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. వీటికి ఓటీటీ ఆడియెన్స్ నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఇక సినీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఓటీటీ సంస్థలు కూడా ఎక్స్‌క్లూజివ్ మూవీస్, ఒరిజినల్స్, వెబ్ సిరీస్‌లతో మన ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ . 1998లో ఓ మారుమూల గ్రామంలో జరిగే క్రైమ్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. రేపల్లె అనే పల్లెటూరులో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతుంటారు. మరీ ముఖ్యంగా రాత్రి పూట అడవి వైపు వెళ్లే అమ్మాయిలు అదృశ్యమై పోతారు. దీంతో పోలీసులు అలర్ట్ అవుతారు. రాత్రి సమయంలో అడివిగుట్ట వైపు ఎవరూ వెళ్లొద్దంటూ గ్రామంలో చాటింపు వేయిస్తారు. ఇదే టైంలో ఆ ఊరి స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరుతుంది కనకం . అమ్మాయిల మిస్సింగ్ కేసును టేకప్ చేస్తుంది. దర్యాప్తులో భాగంగా ఆమెకు సంచలన విషయాలు తెలుస్తాయి. మరి అమ్మాయిల మిస్సింగ్ వెనక మిస్టరీ ఏంటి? కానిస్టేబుల్ కనకం ఈ కేసును ఎలా సాల్వ్ చేసింది. దర్యాప్తులో ఆమెకు ఎదురైన పరిణామాలేంటి? అనేదే స్టోరీ.
హీరోయిన్ వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. అలాగే కోవెలమూడి సత్యసాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ సంయుక్తంగా ఈ సిరీస్ నిర్మించారు. అవసరాల శ్రీనివాస్, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి విడుదలైన పోస్టర్స్ ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సిరీస స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆగస్ట్ 14 నుంచి ‘ఈటీవీ విన్’ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుంది. ‘నిత్యం మనం చూసే పోలీస్ కాదు. సాధారణమైన కేసు కూడా కాదు. ‘కానిస్టేబుల్ కనకం’ అన్నింటినీ షేక్ చేయడానికి రెడీ అవుతోంది.’ అంటూ మేకర్స్ ఈ సిరీస్ కు సంబంధించి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఆగస్టు 14 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..
Not your regular cop. Not your regular case. Constable Kanakam is all set to shake things up! 😎#adhijinkakadu 🔥 A Win Original Series 👉 Only on @etvwin Premieres AUG 14 First Episode Free @VarshaBollamma @RajeevCo Written & Directed by : @dimmalaprasanth 🎥… pic.twitter.com/pk1KOSaakb
— ETV Win (@etvwin) July 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








