AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kingdom: విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌.. కింగ్‌డమ్‌ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా కింగ్ డమ్. మళ్లీ రావా, జెర్సీ సినిమాల డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ జులై 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Kingdom: విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌.. కింగ్‌డమ్‌ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది
Kingdom Movie
Basha Shek
|

Updated on: Jul 27, 2025 | 2:03 PM

Share

రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ రిలీజ్ కు సిద్ధమైంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ మరో కీలక పాత్రలో మెరిశాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. కాగా కింగ్ డమ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పెషల్ ఇంటర్వ్యూకు హోస్ట్‌గా మారారు. ఈ సందర్భంగా కింగ్ డమ్ సినిమాపై సందీప్ తన మొదటి రివ్యూ ఇచ్చారు.

‘నేను కింగ్ డమ్ సినిమాను సుమారు 45 నిమిషాల పాటు చూశాను. ఈ సినిమా చూస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేద‌నే విషయం కూడా మర్చిపోయాను. అంతగా మూవీలో లీనమయ్యాను. విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గౌతమ్ సూపర్ హిట్ కొట్టాడు. సినిమా మాడ్‌గా ఉంది. వేరే లెవల్ అనిపించింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మూడు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. అతని లుక్స్ కూడా అదిరిపోయాయి. ఫస్ట్ లుక్ విడుదల సమయంలోనే నేను విజయ్‌కు ఫోన్ చేసి లుక్ అదిరిపోయిందన్నాను. ఇప్పుడు మూవీ చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది. అనిరుధ్‌ మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గా ఉంది. ఆర్‌ఆర్ అద్భుతంగా ఉండబోతుంది’ అని చెప్పుకొచ్చారు సందీప్ రెడ్డి వంగా.

ఇవి కూడా చదవండి

సందీప్ రెడ్డి వంగాతో విజయ్ దేవరకొండ..

సందీప్ రెడ్డి వంగా కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడే ఈ స్టార్ డైరెక్టర్ ఇంతలా చెప్పాడంటే కింగ్ డమ్ మూవీలో ఏదో స్పెషల్ ఉంటుందని అభిమానులు చర్చించుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పృథ్వీరాజ్ స్పీడ్, టైమ్ మేనేజ్మెంట్ చూసి ఇండస్ట్రీ వర్గాల షాక్
పృథ్వీరాజ్ స్పీడ్, టైమ్ మేనేజ్మెంట్ చూసి ఇండస్ట్రీ వర్గాల షాక్
వినాయకుడిని ఇంట్లో ఎన్ని రోజులు ఉంచితే మంచిది?
వినాయకుడిని ఇంట్లో ఎన్ని రోజులు ఉంచితే మంచిది?
మెంతులు వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు ఖాయం..
మెంతులు వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు ఖాయం..
ఆవాలు, జీలకర్రే కాదు.. పోపులో ఈ గింజలు ఎందుకు వేస్తారో తెలుసా?
ఆవాలు, జీలకర్రే కాదు.. పోపులో ఈ గింజలు ఎందుకు వేస్తారో తెలుసా?
గణేషుని పూజకు ఇలాంటి డ్రెస్‌లో వస్తావా? 'కల్కి'హీరోయిన్‌పై ఆగ్రహం
గణేషుని పూజకు ఇలాంటి డ్రెస్‌లో వస్తావా? 'కల్కి'హీరోయిన్‌పై ఆగ్రహం
భోజనం ఇలా తింటున్నారా? లక్ష్మీదేవికి కోపం వస్తుందట!
భోజనం ఇలా తింటున్నారా? లక్ష్మీదేవికి కోపం వస్తుందట!
ఒకే ఓవర్లో 27 పరుగులు.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!
ఒకే ఓవర్లో 27 పరుగులు.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!
చేరికలు, అలకలు, చీలికలు, కన్నీళ్లు.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
చేరికలు, అలకలు, చీలికలు, కన్నీళ్లు.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
వినాయక చవితి.. మూడో రోజు ప్రసాదానికి ఈ నైవేద్యం 100 మందికి
వినాయక చవితి.. మూడో రోజు ప్రసాదానికి ఈ నైవేద్యం 100 మందికి
బాక్సాఫీస్ శత్రువుల దోస్తీ.. సీఎం- ఆ స్టార్ హీరో మధ్య స్నేహం..
బాక్సాఫీస్ శత్రువుల దోస్తీ.. సీఎం- ఆ స్టార్ హీరో మధ్య స్నేహం..