AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పునీత్‌తో ఉన్న ఈ పిల్లాడు ఇప్పుడు హీరో అయిపోయాడు.. డ్యాన్సులు ఇరగదీస్తున్నాడు.. గుర్తు పట్టారా?

స్టార్ నటీ నటుల చిన్ననాటి, త్రో బ్యాక్ ఫొటోలు సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తుంటాయి. వీటిని చూసి సినీ అభిమానులు, నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతుంటారు. తమ హీరో చిన్నప్పుడు ఇలా ఉండేవాడా? అప్పటికీ, ఇప్పటికీ ఎంతగా మారిపోయాడు కదా? అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు.

Tollywood: పునీత్‌తో ఉన్న ఈ పిల్లాడు ఇప్పుడు హీరో అయిపోయాడు.. డ్యాన్సులు ఇరగదీస్తున్నాడు.. గుర్తు పట్టారా?
Puneeth Rajkumar
Basha Shek
|

Updated on: Jul 24, 2025 | 9:37 PM

Share

దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కన్నడ హీరోనే అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనూ అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. చిన్నతనంలోనే స్టార్ హీరోగా ఎదిగిన అప్పు నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో కన్నుమూశాడు. అయితే తన సినిమాలు, సామాజిక సేవా కార్యక్రమాల రూపంలో ఇప్పటికీ అభిమానుల గుండెల్లో ఉన్నాడీ కన్నడ హీరో. ఇక పునీత్ ను ఆదర్శంగా తీసుకునే ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. నటులుగా రాణిస్తూ తమ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఓ కొత్త హీరో కూడా సినిమాల్లోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమాలోనే అద్భుతమైన డ్యాన్సులు, ఫైట్లతో ఆకట్టుకున్నాడు. యాక్టింగ్ పరంగా కూడా మంచి మార్కులే అందుకున్నాడు. ఈ క్రమంలో కొందరు సినీ అభిమానులు, నెటిజన్లు ఈ యంగ్ హీరోను పునీత్ రాజ్ కుమార్ తో పోల్చుతున్నారు. ఇద్దరినీ కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఇవి నెట్టింట బాగా వైరలవుతున్నాయి. అలా పై ఫొటో కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. మరి అందులో పునీత్ తో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు ఇటీవలే జూనియర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరిటీ. జూనియర్ సినిమా రిలీజ్ నేపథ్యంలో అతని చిన్ననాటి ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి జూనియర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.జూలై 18న రిలీజైన ఈ సినిమమా థియేటర్లలో బాగానే సందడి చేస్తోంది. కిరిటీ డ్యాన్సులు, ఫైట్లకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా వైరల్ వయ్యారీ సాంగ్ లో శ్రీలీలకు పోటీగా కిరిటీ వేసిన స్టెప్పులు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ను గుర్తకు తెచ్చాయంటున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

పునీత్ రాజ్ కుమార్ తో కిరిటీ రెడ్డి..

View this post on Instagram

A post shared by Kireeti (@kireetiofficial)

రాధా కృష్ణారెడ్డి తెరకెక్కించిన జూనియర్ సినిమాలో రవిచంద్రన్, జెనీలియా, రావు రమేష్, సత్య కీలక పాత్రలో పోషించారు. వారాహి చలన చిత్ర, సాయి కొర్రపాటి ప్రొడక్షన్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మించారు. రజనీ కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

శివన్నతో కలిసి..

View this post on Instagram

A post shared by Kireeti (@kireetiofficial)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..