Viral Vayyari Song: శ్రీలీల వైరల్ వయ్యారి సాంగ్.. హీరో ముందే డ్యాన్స్ ఇరగదీసిన స్టూడెంట్.. వీడియో ఇదిగో
గతేడాది పుష్ప-2 చిత్రంలో కిస్సిక్ సాంగ్‌తో అలరించింది శ్రీలీల. ఇప్పుడు వైరల్ వయ్యారినే అంటూ మరోసారి అలాంటి ఊపున్న సాంగ్‌తో మెప్పిస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు.

‘వైరల్ వయ్యారి నేనే.. వయసొచ్చిన అణుబాంబును’.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సాంగ్ ఇది. ఇన్ స్టా గ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్.. ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ చూసినా ఈ సాంగ్ స్టెప్పులు, డ్యాన్సులే దర్శనమిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్దుల దాకా అందరూ ఈ పాటను రీక్రియేట్ చేస్తున్నారు. తమదైన స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తాజాగా ఇదే పాటకు కర్ణాటకు చెందిన ఓ విద్యార్థిని అద్భుతంగా డ్యాన్స్ చేసింది. హీరో కిరిటీ సమక్షంలోనే ఎంతో ఎనర్జిటిక్ గా స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను కిరిటీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. డ్యాన్స్ తో అదరగొట్టిన అమ్మాయికి చిరు కానుక అందించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. చిన్నారి డ్యాన్స్ టాలెంట్ ను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన మొదటి చిత్రం జూనియర్. టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటించింది. రాధాకృష్ణ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా జులై 18 న ఒకేసారి కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజైంది. ఈ సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలోని వైరల్ వయ్యారీ సాంగ్ అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. శ్రీలీల ఎనర్జిటిక్ స్టెప్పులకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. అలాగే మొదటి సినిమానే అయినా కిరిటీ కూడా బాగా చేశాడంటూ కితాబిస్తున్నారు.
వైరల్ వయ్యారి సాంగ్ కు స్టూడెంట్ డ్యాన్స్.. వీడియో
The super talented V. Pooja from Kurugodu, a beautiful village in my hometown Ballari, dancing her heart out to #ViralVayyari.
Blessings to you, little star! #Junior pic.twitter.com/FITaWGU6ra
— Kireeti (@KireetiOfficial) July 23, 2025
ఇటీవలే ఇదే వైరల్ వయ్యారి పాటకు సీనియర్ నటి, బామ్మ పాత్రలకు ఫేమస్ అయిన మణి తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. హైదరాబాద్‌లో జరిగిన జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమతో కలిసి స్టెప్పులేశారు. ఈ వీడియో కూడా నెట్టింట బాగా వైరలైన సంగతి తెలిసిందే.
నటి మణి స్టెప్పులు.. వీడియో ఇదిగో..
Good music and good vibe has no age barrier ❤️
The most viral dance for #ViralVayyari at the #Junior Grand Pre Release Event ❤🔥
Watch live now! ▶️ https://t.co/XiLs4gDSed#Junior Grand release on July 18th ✨#JuniorOnJuly18th #JuniorPreReleaseEvent pic.twitter.com/JSCTs2onDa
— Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) July 16, 2025
జూనియర్’ సినిమా జూలై 18న కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో కిరీటి, శ్రీలీలతో పాటు రవిచంద్రన్, జెనీలియా డిసౌజా కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
వైరల్ వయ్యారీ సాంగ్ తెలుగు వెర్షన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








