AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Sandesh: పుట్టిన రోజు స్పెషల్.. భార్య నుంచి వరుణ్ సందేశ్ కు ఊహించని సర్‌ప్రైజ్‌.. ఫొటోస్ వైరల్

టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో వరుణ్ సందేశ్-వితికా షేరు జోడీ ఒకటి. ఒక సినిమా షూటింగ్ లో ప్రేమలో పడిన వీరు పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. 2016లో వీరి వివాహం జరిగింది. అయితే తాజాగా వరుణ్ సందేశ్ కు తన భార్య నుంచి ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది.

Varun Sandesh: పుట్టిన రోజు స్పెషల్.. భార్య నుంచి వరుణ్ సందేశ్ కు ఊహించని సర్‌ప్రైజ్‌.. ఫొటోస్ వైరల్
Varun Sandesh
Basha Shek
|

Updated on: Jul 23, 2025 | 8:32 AM

Share

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ సోమవారం (జులై 21) తన పుట్టిన రోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ హీరోకు బర్త్ డే విషెస్ చెప్పారు. కాగా ఇదే సందర్భంగా తన భార్య నుంచి ఒక ఊహించిన గిఫ్ట్ అందుకున్నాడు వరుణ్ సందేశ్. దీన్ని చూసి హీరో ఆనందంలో మునిగిపోయాడు. ఇంతకీ వరుణ్ కు వితికా ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా? కొత్త ఇల్లు. అవును.. వరుణ్ బర్త్‌డే సందర్భంగా కొత్త ఇంటిని బహుమతిగా ఇచ్చింది వితిక. ఈ విషయాన్ని వరుణ్ సందేశ్ స్వయంగా వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను పంచుకున్నాడు. భార్యతో కలిసి బర్త్‌ డే సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేసిన వరుణ్.. .’నా పుట్టినరోజుకి నువ్వు ఇల్లు కొని ఇచ్చినప్పుడే నేను ధన్యుడిని అయిపోయాను. ఈ వాస్తవమైన ఊహించలేని ఆశ్చర్యాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాను. ఇది కేవలం బహుమతి కాదు.. ఇది పూర్తిగా కొత్త అధ్యాయానికి నాంది. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా. నన్ను నిరంతరం ఆశ్చర్య పరుస్తూ.. నాకు అన్ని విషయాల్లో మద్దతుగా నిలుస్తూ.. ఇప్పుడు నా ఇంటి యజమానిగా ఉన్నందుకు ధన్యవాదాలు. నా సూపర్ ఉమెన్‌ను హద్దుల్లేని ప్రేమకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా’ అంటూ తన భార్యపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చాడు.

వరుణ్ సందేశ్ షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు వరుణ్- వితిక దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.కాగా ‘పడ్డానండి ప్రేమలో మరి’ అనే సినిమా షూటింగలో మొదటి సారి వరుణ్, వితికల పరిచయం మొదలైంది. . ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు . ఆ తర్వాత 2016 ఆగస్టు 19న పెద్దల అనుమతితో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు.

ఇవి కూడా చదవండి

భార్యతో కలిసి బర్త్ డే వేడుకల్లో వరుణ్ సందేశ్..

కాగా ఈ జంట పెళ్లి తర్వాత బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. పెళ్లి తర్వాత వితిక సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అయితే అప్పుడప్పుడు టీవీ షోల్లో మాత్రం కనిపిస్తుంటుందీ అందాల తార. ఇక సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది వితిక. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేస్తుంటుంది. ఇక వరుణ్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..