AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం.. వీడియో వైరల్

సినిమా నేపథ్యమున్న కుటుంబంలో పుట్టడంతో ఛైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చిన్నతనంలోనే స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ తల్లి కానుంది.

Tollywood: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం.. వీడియో వైరల్
Tollywood Actress
Basha Shek
|

Updated on: Aug 25, 2025 | 6:35 PM

Share

చైల్డ్‌ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించిన మాళవిక రాజ్ 2001లో విడుదలైన సూపర్‌ హిట్‌ అయిన ‘కభీ ఖుషీ కభీ ఘమ్‌’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో ఆమె పోషించిన పూజా పాత్ర ఆడియెన్స్ కు బాగా నచ్చేసింది. దీని తర్వాత రింజిన్ డెంజోంగ్పాతో కలిసి ‘స్క్వాడ్’ అనే యాక్షన్ చిత్రంలో కూడా నటించిందీ అందాల తార. అలాగే కరణ్ జోహార్ తెరకెక్కించిన ‘K3G’ అనే చిత్రంలోనూ యాక్ట్ చేసింది. ఇక 2017లో వచ్చిన టాలీవుడ్ చిత్రం జయదేవ్‌లో కూడా కనిపించిందీ ముద్దుగుమ్మ. కాగా సినిమా కెరీర్ ఫుల్ స్పీడ లో ఉండగానే ప్రముఖ వ్యాపార వేత్త ప్రణవ్ బగ్గాతో ప్రేమలో పడింది మాళవిక. కొన్నేళ్ల డేటింగ్‌ తర్వాత పెద్దల అనుమతితో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. గతేడాది బీచ్‌లో జరిగిన వీరిద్దరి పెళ్లి వేడుకలో పలువురు సినీతారలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి. ఇక ఈ ఏడాది మే నెలలో అభిమానులకు శుభవార్త చెప్పింది మాళవిక. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తాజాగా ఈ అమ్మడి సీమంతం వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్ కు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు.  ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది మాళవిక. ఇందులో భర్త ప్రణవ్ బగ్గా తో కలిసి ఎంతో ఆనందంగా కనిపించిందీ అందాల తార.

ఈ సందర్భంగా తన సీమంతం ఫంక్షన్ కు హాజరై మీ ప్రేమను పంచిన అందరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది మాళవిక. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మాళవిక దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మాళవికా రాజ్ సీమంతం వీడియో..

కాగా మాళవికా రాజ్‌ ప్రముఖ బాలీవుడ్ నటుడు జగదీశ్ రాజ్ మనవరాలు, బాబీ రాజ్ కుమార్తె. అంతేకాకుండా ప్రముఖ నటి అనితా రాజ్ మేనకోడలు కూడా. అయితే వారిలా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిందీ అందాల తార.

భర్తతో కలిసి రొమాంటిక్ గా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యాస్ వదిలినప్పుడు దుర్వాసన ఎందుకు వస్తుంది.. కారణం ఇదే
గ్యాస్ వదిలినప్పుడు దుర్వాసన ఎందుకు వస్తుంది.. కారణం ఇదే
క్రెడిట్ కార్డ్ గురించి పిన్ టూ పిన్ డీటేల్స్ .. మీకు అర్థమయ్యేలా
క్రెడిట్ కార్డ్ గురించి పిన్ టూ పిన్ డీటేల్స్ .. మీకు అర్థమయ్యేలా
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిని తెలుగమ్మాయి.. నంబర్-1 బౌలర్‌గా
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిని తెలుగమ్మాయి.. నంబర్-1 బౌలర్‌గా
పంత్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని ఢిల్లీ కెప్టెన్ అక్షర్‌! కారణం..?
పంత్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని ఢిల్లీ కెప్టెన్ అక్షర్‌! కారణం..?
హోం లోన్ తీసుకునేముందు జాగ్రత్త.. స్ప్రెడ్ గురించి తెలుసుకోకపోతే.
హోం లోన్ తీసుకునేముందు జాగ్రత్త.. స్ప్రెడ్ గురించి తెలుసుకోకపోతే.
ఆస్తులు అని మీరు అనుకుంటారు.. కానీ పేదోళ్లు అయిపోతారు..
ఆస్తులు అని మీరు అనుకుంటారు.. కానీ పేదోళ్లు అయిపోతారు..
పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఏం చేయాలో తెలియట్లేదా.. ఇదిగో వీక్లీ మెనూ
పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఏం చేయాలో తెలియట్లేదా.. ఇదిగో వీక్లీ మెనూ
ఆ హీరో క్యారెక్టర్ చేశానని నన్ను చంపాలనుకున్నారు.. కానీ
ఆ హీరో క్యారెక్టర్ చేశానని నన్ను చంపాలనుకున్నారు.. కానీ
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పెరగనున్న ఆహార ధరలు.
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పెరగనున్న ఆహార ధరలు.
10 మంది భర్తలను అయినా మారుస్తా..
10 మంది భర్తలను అయినా మారుస్తా..