AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకే ఏడాదిలో 36 సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ హీరో.. నాలుగేళ్లలో ఏకంగా 139 సినిమాలు.. ఎవరో తెలుసా?

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏడాదికి కనీసం ఒక సినిమానైనా రిలీజ్ చేసేందుకు తెగ తంటాలు పడుతున్నారు స్టార్ హీరోలు. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక సినిమా, సినిమాకు మరింత గ్యాప్ తీసుకుంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ ఇదే పరిస్థితి.

Tollywood: ఒకే ఏడాదిలో 36 సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ హీరో.. నాలుగేళ్లలో ఏకంగా 139 సినిమాలు.. ఎవరో తెలుసా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Jul 23, 2025 | 7:14 AM

Share

ప్రస్తుతం సినిమాల్లో పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతోంది. భారీ బడ్జెట్, మల్టీ స్టారర్స్, వీఎఫెక్స్ హంగులు, ప్రమోషన్స్.. ఇలా ఒక్కో సినిమా పట్టాలెక్కి షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయం పడుతుంది. ఇక స్టార్ హీరోలు కూడా ఇదే పంథాను ఫాలో అవుతున్నారు. పాన్ ఇండియా మోజులో పడి రెండేళ్లకు ఒక సినిమా గానీ చేయలేకపోతున్నారు. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా స్టార్ హీరోలందరూ ఏడాదికి ఒక్కోక్క సినిమా మాత్రమే చేస్తున్నారు. తమిళ్, కన్నడ, హిందీ హీరోలది కూడా అదే పరిస్థితి. అయితే కొన్నేళ్లకు ముందు ఈ పరిస్థితి లేదు. సినిమాల నిర్మాణం చకా చకా జరిగిపోయేది. హీరోలు కూడా వేగంగా తమ సినిమాలను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేవారు. అలా ఒక స్టార్ హీరో ఒక ఏడాదిలో 36 సినిమాలు రిలీజ్ చేసి రికార్డ్ సృష్టించాడు. అంతేకాదు 4 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 139 సినిమాలు చేసి చరిత్ర సృష్టించాడు. అతను మరెవరో కాదు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి.

ఇవి కూడా చదవండి

73 ఏళ్ల మమ్ముట్టి తన కెరీర్‌లో ఇప్పటిదాకా 435కు పైగా సినిమాల్లో నటించారు. ఎక్కువగా మలయాళ సినిమాల్లోనే నటించినా తెలుగులోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. స్వాతి కిరణం, దళపతి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు మమ్ముట్టి. ఆ మధ్యన అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించారీ సీనియర్ హీరో. అయితే ఒకే ఏడాదిలో మమ్ముట్టి 36 సినిమాల్లో నటించాడనే విషయం చాలా మందికి తెలియదు. 1983లో ఆయన నటించిన 36 సినిమాలు రిలీజయ్యాయి. ఆ మరుసటి ఏడాది అంటే 1984లో 34 సినిమాలు, ఆ తర్వాత 1985లోనూ 34 సినిమాలు, 1986లో 35 చిత్రాలు చేశారు మమ్ముట్టి. అంటే 1983 నుంచి 1986 మధ్య నాలుగేళ్లలోనే ఏకంగా 139 సినిమాలు చేశారీ సీనియర్ హీరో. అంటే ఆయన ఎంత స్పీడ్ తో సినిమాలు కంప్లీట్ చేశారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

రిలీజ్ కు రెడీ అవుతోన్న బజూకా..

View this post on Instagram

A post shared by Mammootty (@mammootty)

ఇక మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ కూడా హీరోగా రాణిస్తున్నాడు.తండ్రి బాటలోనే నడుస్తూ వేగంగా సినిమాలు చేస్తున్నాడు. 13 ఏళ్ల కెరీర్‌లో 36 సినిమాల్లో నటించిన దుల్కర్ ఈ మధ్యన కాస్త స్లో అయ్యాడు.

View this post on Instagram

A post shared by Mammootty (@mammootty)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..