AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: డ్రగ్స్‌తో అమ్మాయిలను హతమార్చే సైకో కిల్లర్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇటీవలే థియేటర్లలో రిలీజ్ కాగా ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేశాయి. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి రానుంది. అది కూడా మరికొన్ని గంటల్లో..

OTT Movie: డ్రగ్స్‌తో అమ్మాయిలను హతమార్చే సైకో కిల్లర్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 24, 2025 | 1:51 PM

Share

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (జులై 25) కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి రానున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో ఇటీవలే థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన ఓ సినిమా కూడా ఉంది. క్రైమ్ థ్రిల్లర్‌ అండ్ ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ను బాగా మెప్పించింది. బాక్సాఫీస్‌ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. అయితే నెల తిరక్కుండానే ఓటీటీలోకి రానుంది. సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్. అమ్మాయిల హత్యల చుట్టూ తిరిగే స్టోరీ. రమ్య అనే అమ్మాయి హత్యతో ఈ సినిమా కథ మొదలవుతుంది. గుర్తు తెలియని వ్యక్తి ఓ మండే స్వభావం ఉన్న డ్రగ్ ను ఆమెలోకి ఇంజెక్ట్ చేసి చంపేస్తారు. ఈ కేసును ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ ధృవ రంగంలోకి దిగుతాడు. పదేళ్ల క్రితం అతని కూతురు కూడా ఇలాగే హత్యకు గురవడంతో ధ్రువ ఈ కేసును పర్సనల్ గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. అలా తనకు దొరికిన ఆధారాలతో అరవింద్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుంటాడు. అతడిని విచారిస్తే.. ఎవరూ ఊహించలేని కొన్ని సంచలన నిజాలు బయటకు వస్తాయి. అరవింద్ వింత ప్రవర్తన, అతీంద్రయ శక్తికి ధృవ ఆశ్చర్యపోతాడు.

మరి అరవింద్ కు, అమ్మాయిల హత్యలకు సంబంధమేంటి? ధృవ కూతురిని చంపింది ఎవరు? అసలు కిల్లర్ మోటివ్ ఏంటి? ధ్రువ ఈ కేసును సాల్వ్ చేయగలిగాడా? కిల్లర్ ను పట్టుకున్నాడా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ క్రైమ్ థ్రిల్లర్ పేరు మార్గన్. బిక్షగాడు ఫేమ్ విజయ్ ఆంటోని హీరోగా నటించాడు. అజయ్‌ దిశాన్‌, బ్రిగిడా, దీప్శిఖ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శుక్రవారం ( జులై 25) మార్గన్ సినిమా టెంట్ కొట్టలో స్ట్రీమింగ్ కానుంది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఈ మూవీ ఓటీటీలోకి రానుందట. అయితే తెలుగు వెర్షన్ మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..