OTT Movie: థియేటర్లలో 6000 కోట్ల కలెక్షన్లు.. ఇప్పుడు ఓటీటీలోకి.. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను తెలుగులోనూ చూడొచ్చు
కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 6వేల కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ లు ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. కాబట్టి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు బాగా చూసే వారికి ఇది ఒక మంచి విజువల్ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు.

హాలీవుడ్ సినిమాలకు మనదేశంలోనూ భారీగా అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది ఈ ఇంగ్లిష్ సినిమాలను ఎగబడి చూస్తారు. అలా యాక్షన్ జానర్ కు సంబంధించి హాలీవుడ్ ఫ్రాంఛైజీల్లో సూపర్ హిట్ అయిన సిరీస్ మిషన్ ఇంపాసిబుల్. ఇప్పటివరకు ఈ సిరీస్ లో మొత్తం ఏడు సినిమాలు వచ్చాయి. అన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఇండియాలోనూ ఈ సిరీస్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవల ఈ సిరీస్ లో 8వ భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్. సుమారు 3400 కోట్ల బడ్జెట్ తో తిరిగి ఎక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 6000 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి రికార్డల కెక్కింది. ఎప్పటిలాగే హాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో టామ్ క్రూజ్ తన సాహసోపేతమైన యాక్షన్ సీక్వెన్స్ తో ఆడియెన్స్ ను అబ్బురపరిచాడు. మన దేశంలోనూ ఈ సినిమాకు భారీ వసూళ్లు దక్కాయి.
ఇలా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తాజాగా మిషన్ ఇంపాజిబుల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆగస్టు 19 నుంచి ఈ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇంగ్లిష్, తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లోనూ ఈ విజువల్ వండర్ స్ట్రీమింగ్ కు రానుంది. అయితే మిషన్ ఇంపాజిబుల్ సినిమాని ఓటీటీలో చూడాలనుకుంటే సబ్ స్క్రిప్షన్ తో పాటు అదనంగా ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రానుంది.
క్రిస్టోఫర్ మెక్ క్వారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్రాంఛైజీ లో మొదటి సిరీస్ నుంచి ఇప్పటివరకు ఒకే చిత్ర బృందం నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన టామ్ క్రూజ్ ఇండియాలోనూ భారీగా అభిమానులు ఉన్నారు.
ఆగస్టు 19 నుంచి స్ట్రీమింగ్..
🎬 MISSION: IMPOSSIBLE – THE FINAL RECKONING hits digital platforms on August 19.#MissionImpossible #TheFinalReckoning #TomCruise #MI7 #DigitalRelease pic.twitter.com/1uEIymwtjo
— 𝐓𝐞𝐜𝐡 𝐄𝐯𝐨𝐥𝐯 (@Tech_EdgeTE) July 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








