AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఈ క్రైమ్ సిరీస్ చూశాక బయట పడుకోవాలంటే భయపడతారు.. ఓటీటీలో మైండ్ బ్లాక్ అయ్యే రియల్ స్టోరీ

ఇటీవల రియల్ స్టోరీలు కూడా వెండితెరపైకి వస్తున్నాయి. నిజ జీవితంలో జరిగిన సంఘటనలు, కొందరు ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. కొన్నేళ్ల క్రితం వరుస హత్యలతో సంచలనం రేకెత్తించిన ఓ సైకో కిల్లర్ నేపథ్యంతో ఈ సిరీస్ తెరకెక్కింది.

OTT Movie: ఈ క్రైమ్ సిరీస్ చూశాక బయట పడుకోవాలంటే భయపడతారు.. ఓటీటీలో మైండ్ బ్లాక్ అయ్యే రియల్ స్టోరీ
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 23, 2025 | 8:10 PM

Share

సైకో కిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో ఎంగేజింగ్ గా ఉంటాయి. కాన్సెప్ట్ దాదాపు ఒక్కటే అయినా ఇలాంటి సినిమాల్లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఆడియెన్స్ కు మంచి థ్రిల్ వస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి క్రైమ్ స్టోరీనే. అయితే నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. కొన్నేళ్ల క్రితం ముంబై, కోల్ కతా వంటి మహా నగరాలను గడగడలాడించిన సైకో కిల్లర్ నేపథ్యం ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. రాత్రిపూట నిద్రిస్తున్న నిరాశ్రయులను అత్యంత కిరాతకంగా హత్య చేస్తుంటాడు ఆ సీరియల్ కిల్లర్. ముఖ్యంగా ఫుట్ పాత్ పై పడుకునే వారిని బండరాయితో కొట్టి హతమారుస్తుంటాడు. 1985-1989 మధ్య ముంబై, కోల్‌కతాలో సుమారు 13 మంది ఇలాగే సైకో కిల్లర్ చేతిలో దారుణ హత్యకు గురవుతారు. దీంతో ఆ సైకో కిల్లర్ కు స్టోన్ మ్యాన్ అని పేరు పడిపోతుంది. కట్ చేస్తే స్నేహ అనే జర్నలిస్ట్ ట్రైన్ లో హరిద్వార్‌కు వెళ్తూ ఒక డైరీని కనిపెడుతుంది. ఇందులో స్టోన్‌మ్యాన్ హత్యల వివరాలు ఉంటాయి. స్నేహ ఆ డైరీని వెంట పట్టుకుని తన ఫ్రెండ్ తో కలిసి హరిద్వార్‌ కు వెళుతుంది. అక్కడ వాళ్లు బాబా జీబానంద అనే వ్యక్తిని కలుస్తారు. అతను అనుమానాస్పదంగా కనిపిస్తాడు. ఇంతలో ఒక సాధువు స్నేహ, ఆమె ఫ్రెండ్ ను వెంబడిస్తాడు.

మరి ఈ హత్యల వెనక ఉన్న సైకో కిల్లర్ ఎవరు? ఎందుకీ హత్యలు చేశాడు? ఆ బాబాకు కిల్లర్ కు ఉన్న సంబంధం ఏంటి? పోలీసులు ఈ స్టోన్ మ్యాన్ ను పట్టుకున్నారా? చివరకు ఏమైంది? అనేది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఈ ఇంటెన్స్ క్రైమ్ సిరీస్ పేరు స్టోన్ మ్యాన్ మర్డర్స్. రజతభ దత్త (స్టోన్‌మ్యాన్), స్వస్తిక ముఖర్జీ (స్నేహ), రూపంకర్ బాగ్చీ, అరిజిత్ దత్త, జిత్ దాస్ తదితరులు ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో మొత్తం 4 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్‌ సుమారు 17-18 నిమిషాల నిడివి ఉంటుంది. ప్రస్తుతం ఈ సిరీస్ హోయిచోయ్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సిరీస్ ను సులభంగానే అర్థం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..