Samantha: ఆ పేరు ఇంకా పదిలంగానే.. పచ్చబొట్టును చెరిపేయని సమంత.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత ఇప్పుడు సినిమాల కంటే కూడా ఇతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమాయణం నడుపుతుందని, త్వరలో అతనిని రెండో వివాహం చేసుకోనుందని ప్రచారం జరుగుతోంది.

2010లో వచ్చిన ఏమాయ చేసావే సినిమాతో వెండితెరకు పరిచయమైంది సమంత. ఇందులో అక్కినేని అందగాడు నాగ చైతన్య హీరోగా నటించాడు. ఈ సినిమాతోనే సామ్ సక్సెస్ జర్నీ ప్రారంభమైంది. అలాగే ఈ సినిమాతోనే నాగ చైతన్య తో ప్రేమకు బలమైన పునాది పడింది. ఎ న్నో సినిమాల్లో ప్రేమికులుగా నటించిన చై- సామ్ నిజ జీవితంలోనూ లవర్స్ గా మారారు. పెద్దల అనుమతితో 2017లో పెళ్లిపీటలెక్కారు. అందుకే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి ఎంతో స్పెషల్ గా నిలిచిన ఈ సినిమాకు గుర్తుగా సామ్.. YMC (ఏ మాయ చేసావే) అనే పేరుతో ఒక టాటూను తన మెడపై వేయించుకుంది. ఈ పచ్చబొట్టు తనకెంతో స్పెషల్ అని పలు ఇంటర్వ్యూలు, సందర్భాల్లో చెప్పుకొచ్చింది సామ్. దీంతో పాటు చైతన్యతో ప్రేమకు గుర్తుగా కూడా మరో పచ్చబొట్టు వేయించుకుంది. కానీ నాగ చైతన్య- సామ్ ల వైవాహిక జీవితానికి ఎవరి దిష్టి తగిలిందో కానీ 2021లో విడాకులు తీసుకుని విడిపోయారు. అందుకే చై పేరుతో ఉన్న ఒక టాటూను తొలగించుకుంది.
ఇక ఇటీవలసామ్ కనిపించిన ఓ వీడియోలో YMC పచ్చబొట్టు కనిపించకపోవడంతో ఆ గుర్తును కూడా పూర్తిగా చెరిపేసుకుందని అంతా అనుకున్నారు. అయితే అదేమీ జరగలేదు. తాజాగా సామ్ పోస్ట్ చేసిన ఫొటోల్లో ఆ పేరు అలాగే పదిలంగా ఉంది. ఇందులో చీరకట్టులో ఎంతో అందంగా కనిపించింది సామ్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతన్నాయి. నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అందులోనూ వైఎంసీ పచ్చ బొట్టు కనిపించడంతో కొంత మంది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు.
సమంత లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత ఇటీవలే శుభం చిత్రంలో కనిపించింది. ఈ సినిమాతోనే తను నిర్మాతగా మారింది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్ వెబ్‌సిరీస్ చేస్తోంది. అలాగే మా ఇంటి బంగారం సినిమాను నిర్మించడంతో పాటు అందులోనూ ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
చీరకట్టులో ఎంత అందంగా ఉందో..
View this post on Instagram
మహానటి కీర్తి సురేశ్ తో సమంత..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








