AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: లాస్ట్ సీజన్ మిస్ అయ్యింది.. ఈసారి ఎంట్రీ పక్కా! బిగ్ బాస్ 9లోకి టాలీవుడ్ బోల్డ్ హీరోయిన్

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ సందడి మళ్లీ షురూ కానుంది. తెలుగుతో పాటు అన్ని ప్రముఖ భాషల్లోనూ త్వరలోనే ఈ రియాలిటీ షో సీజన్ ప్రారంభం కానుంది. తెలుగు సీజన్ విషయానికి వస్తే.. ఈసారి సర్ ప్రైజింగ్ కంటెస్టెంట్స్ ఉండనున్నారని తెలుస్తోంది.

Bigg Boss Telugu 9: లాస్ట్ సీజన్ మిస్ అయ్యింది.. ఈసారి ఎంట్రీ పక్కా! బిగ్ బాస్ 9లోకి టాలీవుడ్ బోల్డ్ హీరోయిన్
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Jul 29, 2025 | 7:50 PM

Share

తెలుగుతో పాటు అన్ని ప్రముఖ భాషల్లోనూ మళ్లీ బిగ్ బాస్ సందడి ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రోమోలు, గ్లింప్స్ లతో షోపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఎనిమిది సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యాయి. తొమ్మిదో సీజన్ కోసం బుల్లితెర అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పటిలాగే గత సీజన్ల కంటే ఈసారి మరిన్ని హంగులు, సర్ ప్రైజింగ్ రూల్స్ అండ్ టాస్క్ లు ఉండనున్నట్లు సమాచారం. అలాగే కంటెస్టెంట్ల కోసం ఎంపిక ప్రక్రియ దాదాపు తుది దశకు వచ్చిందని టాక్. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల తో పాటు కామన్ మ్యాన్ లు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్ కంటెస్టెంట్‌కి సంబంధించి ఒక ప్రోమోను రిలీజ్ చేశారు. సుమారు 35 సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రోమోకు ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఎంతో మంది నుంచి 40 మందిని సెలెక్ట్ చేశాం. ఇప్పుడు మొదలౌతుంది అసలైన పరీక్ష. దాన్ని దాటుకుని బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లోకి ఎవరు వెళ్తారో.. చూద్దాం’ అని నాగార్జున ఈ ప్రోమోలో చెప్పుకొచ్చారు.

అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ 40 మంది పేరుకి మాత్రమే కామన్‌మ్యాన్ కానీ. వీళ్లంతా ప్రముఖ సెలబ్రిటీలేనని తెలుస్తోంది. ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ఈ ప్రోమోలో కనిపిస్తున్నారని నెటిజన్లు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇందులో ఒక టాలీవుడ్ హీరోయిన్ పేరు కూడా ఉందని తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు రేఖా భోజ్. వైజాగ్ కు చెందిన ఈ బ్యూటీ గతంలో దామిని విల్లా, రంగేలా, కళ్యాణ తస్మై నమహ: తదితర చిత్రాల్లో నటించింది. ఎక్కువగా బోల్డ్ పాత్రలతోనే ఫేమస్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

రేఖా భోజ్ లేటెస్ట్ ఫొటోస్..

ఇక రేఖా భోజ్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే పిచ్చి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున కూడా ప్రచారం చేసింది. నిజం చెప్పుకోవాలంటే.. గత సీజన్‌లోనే రేఖ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాల్సింది. అయితే కొన్ని కారణాలతో ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో రేఖ ఎంట్రీ పక్కాగా ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన బిగ్ బాస్ సీజన్ కామన్ మ్యాన్ కంటెస్టెంట్‌ ప్రోమోలోనూ రేఖ కనిపించిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

అనన్యా నాగళ్లతో రేఖ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!
వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!
నాటు కోడి vs పుంజు తలపడితే ఏది గెలుస్తుందో తెలుసా?
నాటు కోడి vs పుంజు తలపడితే ఏది గెలుస్తుందో తెలుసా?
ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక
ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక
కరకరలాడే మసాలా వడలు.. బయట బండిపై రుచి ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
కరకరలాడే మసాలా వడలు.. బయట బండిపై రుచి ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా
పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా
24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు
24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు
400 మార్కులకు 397.5..ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం!కట్‌చేస్తే
400 మార్కులకు 397.5..ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం!కట్‌చేస్తే
రూ.లక్ష సంపాదించే వ్యక్తికి 10 ఏళ్ల తర్వాత ఎంత డబ్బు అందుతుంది?
రూ.లక్ష సంపాదించే వ్యక్తికి 10 ఏళ్ల తర్వాత ఎంత డబ్బు అందుతుంది?
మాట్లాడుతుండంగా ఫోన్ కట్ అయింది.. ఆ తర్వాత శవమై కనిపించాడు
మాట్లాడుతుండంగా ఫోన్ కట్ అయింది.. ఆ తర్వాత శవమై కనిపించాడు