AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kingdom: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మీట్.. తన అభిమానుల కోసం హీరో ఏయే వంటకాలు పెట్టించాడో తెలుసా? వీడియో

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన అభిమానులకు ఎంతో ప్రాధాన్యమిస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అభిమానులతో కలిసి ఫ్యాన్స్ మీట్ నిర్వహించాడీ టాలీవుడ్ హీరో. కింగ్ డమ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా వందలాది మంది ఫ్యాన్స్ తో సరదాగా ముచ్చటించాడు.

Kingdom: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మీట్.. తన అభిమానుల కోసం హీరో ఏయే వంటకాలు పెట్టించాడో తెలుసా? వీడియో
Vijay Devarakonda
Basha Shek
|

Updated on: Jul 28, 2025 | 4:55 PM

Share

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ త్వరలోనే కింగ్ డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 31న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. హీరో విజయ్ దేవరకొండ స్వయంగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. తాజాగా తన అభిమానుల కోసం ఫ్యాన్స్ మీట్ నిర్వహించాడు విజయ్. హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వందలాది మంది కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంతో ఓపికగా అడిగిన వారందరికీ ఫొటోలు, సెల్పీలు ఇచ్చాడు రౌడీ హీరో. అంతేకాదు తన కోసం వచ్చిన వారిందరికీ రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశాడు. అభిమానుల కోసం చికెన్‌, బగారా అన్నంతో పాటు వివిధ వంటకాలు రెడీ చేసి పెట్టారు. ఈ క్రమంలో తమ పట్ల హీరో విజయ్ చూపిన ప్రేమకు అభిమానులు ఫిదా అవుతున్నారు. విజయ్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తు రౌడీ హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా మరికాసేపట్లో కింగ్ డమ్ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్‌ ఈ మెగా ఈవెంట్ కు వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి విజయ్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున రానున్నారని తెలుస్తోంది. కింగ్‌డమ్‌ చిత్రం జులై 31న పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ‘జెర్సీ’ మూవీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ మరో కీలక పాత్రలో మెరిశాడు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

విజయ్ దేవర కొండ ఫ్యాన్స్ మీట్.. వీడియోలు ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..