AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhu Priya: చెల్లికి దగ్గరుండి నిశ్చితార్థం చేసిన సింగర్ మధు ప్రియ.. ఫొటోస్ ఇదిగో

'ఆడపిల్లనమ్మా' సాంగ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది సింగర్ మధుప్రియ. ప్రస్తుతం సినిమాల్లో ఫోక్ సాంగ్స్ పాడుతూ బిజీగా ఉంటోందీ బ్యూటిఫుల్ సింగర్. తాజాగా మధుప్రియ తన చెల్లికి దగ్గరుండి నిశ్చితార్థం చేసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోయింది.

Madhu Priya: చెల్లికి దగ్గరుండి నిశ్చితార్థం చేసిన సింగర్ మధు ప్రియ.. ఫొటోస్ ఇదిగో
Madhu Priya
Basha Shek
|

Updated on: Jul 27, 2025 | 5:05 PM

Share

ప్రముఖ ఫోక్ సింగర్ మధు ప్రియ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె సోదరి శ్రుతి ప్రియ త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. సుమంత్ పటేల్ అనే వ్యక్తితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది. తాజాగా శ్రుతి ప్రియ- సుమంత్ ల నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. సింగర్ మధుప్రియ దగ్గరుండి మరీ ఈ ఏర్పాట్లు చేసింది. తన చెల్లికి గ్రాండ్ గా నిశ్చితార్థం చేసింది. అనంతరం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఫైనల్లీ.. చెల్లి, మరిది.. మిమ్మల్ని ఇలా చూడడం ఆనందంగా ఉంది’ అంటూ మురిసిపోయింది మధుప్రియ. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ ఆడపిల్లనమ్మా పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పదేళ్ల వయసులోనే ఓ స్టేజీ షోలో ఈ పాట పడి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆ తర్వాత 2011లో ‘దగ్గరగా దూరంగా’ సినిమాలో ‘పెద్దపులి’ అనే హుషారెత్తించే సాంగ్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష‍్యం, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, సంక్రాంతికి వస్తున్నాం, లైలా తదితర సినిమాల్లో మధు ప్రియ పాడిన పాటలు సంగీతాభిమానులను ఉర్రూతలూగించాయి. కాగా ఈ ఏడాది ప్రారంభంలో రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో గోదారి గట్టుమీద సాంగ్‌ను ఆలపించింది కూడా మధు ప్రియనే. మేల్ వెర్షన్ లో రమణ గోగుల ఈ సాంగ్ ను ఆలపించగా, లేడీ వెర్షన్ లో మధు ప్రియ పాడింది. ఈ పాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇవి కూడా చదవండి

చెల్లి నిశ్చితార్థం వేడుకలో సింగర్ మధుప్రియ.. ఫొటోస్..

కాగా 18 ఏళ్ల వయసులోనే శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది మధుప్రియ. అయితే కొన్ని కారణాలతో అతని నుంచి విడిపోయింది. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.

బోనాల ఉత్సవాల్లో మధు ప్రియ..

View this post on Instagram

A post shared by Mahender Reddy (@cine.lokam)

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్