AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: IBMలో జాబ్ మానేసి సినిమాల్లోకి.. మెగాస్టార్ మెచ్చిన టాలీవుడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే యంగ్ హీరోలు ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవినే ఆదర్శంగా తీసుకుంటారు. ఎందుకంటే ఆయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఈ స్థాయికి వచ్చారు. ఈ హీరో కూడా స్వయంకృషితోనే సినిమాల్లోకి వచ్చాడు. తన నటనతో మెగాస్టార్ చిరంజీవినే మెప్పించాడు.

Tollywood: IBMలో జాబ్ మానేసి సినిమాల్లోకి.. మెగాస్టార్ మెచ్చిన టాలీవుడ్  హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Jul 28, 2025 | 4:07 PM

Share

పై ఫొటోలో ఉన్న దెవరో గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ లో బాగా ఫేమస్. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా స్వయం కృషితో స్టార్ గా ఎదిగిన అతి కొద్దిమందిలో ఈ నటుడు కూడా ఒకడు. ఇతను మన తెలుగు హీరోనే. విశాఖ పట్నంలో పుట్టి పెరిగాడు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఐబీఎమ్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థల్లో పని చేశాడు. అదే క్రమంలో నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ పోషించాడు. కెరీర్ ప్రారంభంలోనే మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కల్యాణ్ తదితర స్టార్ హీరోల సినిమాల్లో సహాయక నటుడిగా మెప్పించాడు. అయితే వీటితో సంతృప్తి చెందలేదు. నటుడిగా ఇంకో మెట్లు ఎదగాలనుకున్నాడు. అందుకే 2016 లక్షలు జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. పూర్తి సమయాన్ని సినిమా కెరీర్ కే కేటాయించాడు. ప్రారంభంలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా నిలదొక్కుకున్నాడు. ఒకవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్, సహాయక నటుడి పాత్రలతో ఆడియెన్స్ ను మెప్పించాడు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది మోస్ట్ ట్యాలెంటెడ్ యాక్టర్లలో ఇతను కూడా ఒకరు. ఈ నటుడి ట్యాలెంట్ ను చూసి మెగాస్టార్ చిరంజీవి సైతం మురిసిపోయారు. తన మూడో తమ్ముడంటూ కితాబు కూడా ఇచ్చేశారు. ఇలా మెగాస్టార్ మెప్పు పొందిన ఆ హీరో మరెవరో కాదు సత్యదేవ్.

సత్యదేవ్ కీలక పాత్ర పోషించిన కింగ్ డమ్ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హీరో విజయ్ దేవరకొండకు సోదరుడు శివ పాత్రలో నటించాడు సత్యదేవ్. ఇప్పటివరకు రిలీజైన గ్లింప్స్, ట్రైలర్లలో సత్యదేవ్ కూడా హైలెట్ గా నిలిచాడు. ఈ నేప థ్యంలో ఈ నటుడికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టంట వైరలవుతున్నాయి. కాగా సినిమల్లోకి రాక ముందు పలు కంపెనీల్లో పని చేశాడు సత్యదేవ్. ఆర్చిటెక్చర్ గా ఐబీఎమ్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థలో వివిధ హోదాల్లో పని చేశాడు. 2011లో ప్రభాస్ మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాతో మొదటి సారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడు. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

కింగ్ డమ్ సినిమాలో సత్యదేవ్..

ప్రస్తుతం సత్యదేవ్ చేతిలో కింగ్ డమ్ సినిమాతో పాటు ఫుల్ బాటిల్, గరుడ వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

View this post on Instagram

A post shared by Satyadev (@actorsatyadev)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..