- Telugu News Photo Gallery Cinema photos Jabardasth Actress Satya Sri Offers Bonam Bonam to Goddess Sri Mahakali, See Photos
Jabardasth Satya Sri: జై మహంకాళి.. మొదటి సారి బోనమెత్తిన జబర్దస్త్ సత్యశ్రీ.. ఫొటోస్ ఇదిగో
హైదరాబాద్ నగర వ్యాప్తంగా బోనాల సంబరాలు అంబరాన్నంటున్నాయి. సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో భాగమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నటి, జబర్దస్త్ ఫేమ్ సత్య శ్రీ మొదటిసారి బోనమెత్తానంటూ మహంకాళి బోనాల్లో పాల్గొన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Updated on: Jul 30, 2025 | 9:51 PM

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు పొందిన వారిలో లేడీ కమెడియన్ సత్యశ్రీ కూడా ఒకరు. చమ్మక్ చంద్రతో కలిసి ఆమె చేసిన స్కిట్లు బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. ప్రస్తుతం టీవీషోలతో పాటు అడపా దడపా సినిమాల్లోనూ మెరుస్తోందీ అందాల తార.

జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో పలు ఈవెంట్స్, సినిమాలలోనూ ఛాన్స్‌లు దక్కించుకుంటోంది సత్యశ్రీ. ఇటీవల పలు సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్‌గానూ నటించిందీ జబర్దస్త్ యాక్ట్రస్.

యూత్ నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో సత్య చేసిన స్పెషల్ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. అలాగే ఈ సాంగ్ తెరకెక్కించిన తీరుపై కొన్ని విమర్శలు కూడావచ్చాయి.

ప్రస్తుతం టీవీషోస్, సినిమాలతో బిజీగా ఉంటోన్న సత్యశ్రీ బోనాల ఉత్సవాల్లో పాల్గొంది. ఇందులో మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించింది.

బోనాల ఉత్సవాల్లో సత్యశ్రీ పాల్గొనడం ఇదే మొదటి సారి. ఈ క్రమంలో తన బోనాల ఉత్సవాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుందీ అందాల తార.

వీటికి 'జై మహంకాళి.. అమ్మవారికి మొదటి సారి బోనం సమర్పించాను' అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది సత్యశ్రీ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.




