- Telugu News Photo Gallery Cinema photos Actress Ananya Panday says Wah Taj as she poses in front of the Taj Mahal
Ananya Panday: వాహ్ తాజ్.. తాజ్ మహల్ అందాన్ని ఆస్వాదిస్తున్న లైగర్ బ్యూటీ
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు చాలా మంది అందాల భామలు వచ్చారు. కానీ వచ్చిన వారందరూ సక్సెస్ కాలేదు. కొంతమంది ఒకటి రెండు సినిమాలతోనే కనిపించకుండా పోయారు. అలాంటి వారిలో అనన్య పాండే ఒకరు. ఈ అమ్మడు తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటుడు చంకీ పాండే కుమార్తె కావడంతో అనన్యకు సినిమా అవకాశాలు సులభంగా వచ్చాయి.
Updated on: Jul 30, 2025 | 9:51 PM

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు చాలా మంది అందాల భామలు వచ్చారు. కానీ వచ్చిన వారందరూ సక్సెస్ కాలేదు. కొంతమంది ఒకటి రెండు సినిమాలతోనే కనిపించకుండా పోయారు. అలాంటి వారిలో అనన్య పాండే ఒకరు. ఈ అమ్మడు తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

నటుడు చంకీ పాండే కుమార్తె కావడంతో అనన్యకు సినిమా అవకాశాలు సులభంగా వచ్చాయి. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సీజన్ 2’ ద్వారా అనన్య పాండే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఇంకో సినిమాతో సక్సెస్ కొట్టేద్దామనుకుంది అననన్య. కానీ

‘పతి పత్నీ ఔర్ వో’, ‘ఖాలీ పీలీ’, ‘గెహ్రాయన్’ ఖో గయే హమ్ కహాన్, బాడ్ న్యూజ్, ఖేల్ ఖేల్ మే.. ఇలా అనన్య నటించిన సినిమాలు యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకున్నాయి. అయితే ఇటీవల అక్షయ్ కుమార్ తో కలిసి ఆమె నటించిన కేసరి చాప్టర్ 2 సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇది తెలుగులో లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. ఆతర్వాత అనన్య మరో తెలుగు సినిమాలో కనిపించలేదు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనన్య పాండే.. తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. తజ్ మహల్ అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలను షేర్ చేసింది అనన్య. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ అనన్య ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.




