AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shalini Ajithkumar: ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఒకే ఒక్క హీరోను మాత్రమే ఫాలో అవుతోన్న షాలిని.. భర్త అజిత్ మాత్రం కాదండోయ్

బాలనటిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది షాలిని. అలాగే హీరోయిన్ గా సఖి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే హీరో అజిత్ ను ప్రేమించి పెళ్లి చేసుకుందీ అందాల తార.

Shalini Ajithkumar: ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఒకే ఒక్క హీరోను మాత్రమే ఫాలో అవుతోన్న షాలిని.. భర్త అజిత్ మాత్రం కాదండోయ్
Shalini Ajithkumar
Basha Shek
|

Updated on: Aug 04, 2025 | 8:32 AM

Share

కోలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ అజిత్ కుమార్ కు అధికారిక సోషల్ మీడియా ఖాతాలేమీ లేవు. అయితే ఆయన భార్య షాలినీ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకుంటుంది.కోలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ అజిత్ కుమార్ కు అధికారిక సోషల్ మీడియా ఖాతాలేమీ లేవు. అయితే ఆయన భార్య షాలినీ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకుంటుంది.

బెజవాడ బెబ్బులి (1983) సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది షాలిని. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో బాల నటిగా మెప్పించింది. ముఖ్యంగా 1990లో రిలీజైన చిరంజీవి బ్లాక్‌బస్టర్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరిలో ‘పండు’ అనే పాత్రలో ఎంతో క్యూట్‌గా నటించింది. ఒక్క తెలుగులోనే కాదు మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో బాలనటిగా యాక్ట్ చేసింది షాలిని. ఇక హీరోయన్ గా సఖి సినిమాతో సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిందీ అందాల తార. ఈ మూవీలో షాలిని క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. కాగా సినిమాల్లో ఉండగానే స్టార్ హీరో అజిత్ తో ప్రేమలో పడింది షాలిని. అమర్కళం సినిమా (తెలుగులో “లీలామహల్ సెంటర్”గా రీమేక్ అయింది) వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత 2000లో పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. వివాహం తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటోంది షాలిని. భర్త, పిల్లలే జీవితంగా లైఫ్ ను లీడ్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

భర్త అజిత్ తో షాలిని..

ఇదిలా ఉంటే అజిత్ కుమార్ సోషల్ మీడియా లో పెద్దగా యాక్టివ్ గా ఉండడు. తన పేరిట అధికారిక ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు కూడా లేవు. కొన్నేళ్లకు ముందు షాలిని కూడా ఇలాగే ఉండేది. అయితే ఇప్పుడిప్పుడే ఆమె సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటోంది. కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ లో ఖాతాను తెరచింది షాలిని. అంతే అజిత్ అభిమానులందరూ ఆమె ఫాలోవర్లుగా మారిపోయారు. ప్రస్తుతం షాలినీ ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక షాలినీ కూడా 225 మందిని ఫాలో అవుతోంది. ఇందులో ఎక్కువగా తన స్నేహితులే ఉన్నారు. అయితే ఇన్ స్టాగ్రామ్ లో షాలినీ ఒకే ఒక్క హీరోను మాత్రమే ఫాలో అవుతోంది. అతను మరెవరో కాదు మాధవన్.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సఖి సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించరు మాధవన్, షాలినీ. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్దిరిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ