AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaah Bhatia: ‘విసిగించకండి.. ఒకసారి కనిపిస్తే వారితో పెళ్లి చేసేస్తారా?’ తమన్నా సీరియస్ వార్నింగ్

ఇటీవల విడుదలైన ‘ఓదెల 2’ మువీలో శివశక్తి పాత్రలో తమన్నా జీవించారంటే అతిశయోక్తికాదు. ఈ సినిమాతో నటిగా తనలోని కొత్త కోణాన్ని తమన్నా ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే 35 ఏళ్లు వచ్చినా ఈ భామ ఇప్పటి వరకూ పెళ్లి ఊసే ఎత్తలేదు. నిన్నమొన్నటి వరకు బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో చెట్టాపట్టాలేసుకు తిరిగి ఈ బ్యూటీ..

Tamannaah Bhatia: 'విసిగించకండి.. ఒకసారి కనిపిస్తే వారితో పెళ్లి చేసేస్తారా?' తమన్నా సీరియస్ వార్నింగ్
Tamannaah Bhatia Wedding Rumours
Srilakshmi C
|

Updated on: Aug 04, 2025 | 7:41 AM

Share

అందాల తార తమన్నా బాటియా తెలియని వారుండరు. ఒకప్పుడు అందాల ఆరబోతకు ఎన్నో కండీషన్లు పెట్టి మువీల్లో నటించిన ఈ మిల్కీ బ్యూటీ.. గత కొంతకాలంగా అడ్డుతెరలన్నింటినీ పటాపంచలు చేసి వెండి తెరపై వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఇటీవల విడుదలైన ‘ఓదెల 2’ మువీలో శివశక్తి పాత్రలో తమన్నా జీవించారంటే అతిశయోక్తికాదు. ఈ సినిమాతో నటిగా తనలోని కొత్త కోణాన్ని తమన్నా ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే 35 ఏళ్లు వచ్చినా ఈ భామ ఇప్పటి వరకూ పెళ్లి ఊసే ఎత్తలేదు. నిన్నమొన్నటి వరకు బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో చెట్టాపట్టాలేసుకు తిరిగి ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ అందరికి షాకిస్తూ బ్రేకప్ చెప్పేసుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి ఎవరైనా పెళ్లి గురించి ప్రశ్నించినా కస్సుబుస్సులాడుతుంది.

తాజాగా పాక్‌ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌, తమన్నా త్వరలో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్నారంటూ గతకొన్ని రోజులుగా నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై తమన్నా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ఆ రూమర్స్‌ను ఖండించారు. ఒకసారి కలిసి కనిపిస్తే పెళ్లి చేసేస్తారా? అంటూ ఫైర్‌ అయ్యారు. సోషల్‌ మీడియాలోనే ఇలాంటి గాసిప్స్‌ క్రియేట్‌ అవుతాయని అభిప్రాయపడ్డరాఉ.

అసలేం జరిగిందంటే..

గతంలో ఓ జ్యువెల్లరీ షాపు ప్రారంభోత్సవానికి అబ్దుల్‌తో కలిసి తమన్నా కూడా హాజరయ్యారు. ఈ విషయాన్ని తమన్నా గుర్తు చేసుకుంటూ.. ఏదో ఒక్కసారి అనుకోకుండా కలిస్తే పెళ్లి చేస్తారా? నేను ఎవరినీ పెళ్లి చేసుకోబోవడం లేదు. అబ్దుల్ రజాక్ నేను ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ లో పాల్గొన్నామని, అంతకుమించి ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా తమన్నా పెళ్లి ఇలాంటి రూమర్స్ నెట్టింట చక్కర్లు కొట్టడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ విరాట్‌ కోహ్లీతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు రూమర్స్‌ వచ్చాయి. దీనిపై కూడా తమన్నా రియాక్ట్‌ అయ్యారు. క్రికెటర్ కోహ్లీతో డేటింగ్ చేస్తున్నట్లు కూడా రూమర్స్ వచ్చాయని, తామిద్దరం ఒక యాడ్ లో కలిసి పని చేశామని.. దానికి ఇలాంటి వార్తలు రావడం బాధ కలిగించిందని ఆవేదన చెందారు. ఎవరితో కలిసి నటిస్తే వారితో దయచేసి పెళ్లి చెయ్యకండి అంటూ.. సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలు, యాడ్లు చేస్తూ యమ బిజీగా ఉన్నారు. తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..