AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీచర్‌ చిన్న పొరపాటు.. ఏకంగా 138 మంది బీటెక్‌ విద్యార్ధులు ఫెయిల్‌! చివరకు..

మూడు కాలేజీలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులంతా ఒకటే సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యారు. చిరవకు ఓ విద్యార్థి చేసిన పనికి 138 మంది విద్యార్ధుల భవిష్యత్తు గట్టెక్కింది. ఈ సంఘటన హైదరాబాద్‌ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిధిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

టీచర్‌ చిన్న పొరపాటు.. ఏకంగా 138 మంది బీటెక్‌ విద్యార్ధులు ఫెయిల్‌! చివరకు..
evaluation error in JNTU Hyderabad
Srilakshmi C
|

Updated on: Jul 27, 2025 | 2:05 PM

Share

హైదరాబాద్‌, జులై 27: జవాబుపత్రాలు దిద్దడంలో ఓ ప్రొఫెసర్‌ చేసిన తప్పిదం ఏకంగా 138 విద్యార్ధులు సెకండ్ సెమిస్టర్‌ పరీక్షలో ఫెయిలయ్యారు. మూడు కాలేజీలకు చెందిన ఈ విద్యార్థులంతా ఒకటే సబ్జెక్టులో ఫెయిల్‌ అవడంతో అంతా అయోమయంలో పడిపోయారు. చిరవకు ఓ విద్యార్థి ద్వారా అసలు సంగతి తెలుసుకుని నాలుక కరచుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిధిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

జేఎన్‌టీయూ హైదరాబాద్‌ పరిధిలోని నాలుగో ఏడాది రెండో సెమిస్టర్‌ పరీక్షలు జూన్ నెలలో జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు జులై 17న ప్రకటించారు. బీటెక్ ఫైనల్ ఇయర్ క్రెడిట్‌ బేస్డ్‌ సబ్జెక్టు ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ (ఈఐఏ) ఉంటుంది. అయితే ఈ సబ్జెక్టులో శ్రీదత్త, మల్లారెడ్డి, షాదన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలకు చెందిన విద్యార్ధులందరూ ఫెయిల్‌ అయ్యారు. ఒక్క ఈఐఏ సబ్జెక్టులోనే అధిక మంది ఫెయిల్‌ అయినట్లు గుర్తించిన శ్రీదత్త కాలేజీకి చెందిన ఓ విద్యార్ధి.. అసలు ఆ సబ్జెక్టులో  అంత మంది ఫెయిలయ్యే అవకాశంలేదని మరోసారి ఫలితాలను చెక్‌ చేయాలని కోరుతూ జేఎన్‌టీయూ పరీక్షల విభాగం అధికారులకు మెయిల్‌ చేశాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఒకే సబ్జెక్టులో 138 మంది ఫెయిల్‌ అయ్యారని గుర్తించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఫెయిలైన విద్యార్ధుల జవాబు పత్రాలను పరిశీలించగా అసలు తప్పిదం ఆ పేపర్లు దిద్దిన ప్రొఫెసర్‌దిగా గుర్తించారు.

నిజానికి.. ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ (ఈఐఏ) పరీక్ష ఒకే రోజు ఉదయం, సాయంత్రం రెండు సెషన్‌లలో జరిగింది. రెండు సెషన్లకు వేర్వేరు ప్రశ్నపత్రాలతో ఇంజనీరింగ్‌ విద్యార్ధులకు ఈ పరీక్ష నిర్వహించారు. అయితే ఈ పేపర్లు దిద్దిన ప్రొఫెసర్‌ మాత్రం ఉదయం ప్రశ్నపత్రంతోనే రెండు షిఫ్టుల జవాబు పత్రాలను దిద్దాడు. దీంతో సెకండ్ షిఫ్టులోని విద్యార్ధులంతా ఫెయిలయ్యారు. ఈ పొరబాటు గుర్తించిన వర్సిటీ అధికారులు సాయంత్రం క్వశ్చన్‌ పేపర్‌తో మళ్లీ వారందరి సమాధాన పత్రాలు దిద్దించగా.. ఈసారి ఆ విద్యార్ధులు అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఈ మేరకు జరిగిన తప్పిదాన్ని సరిచేసి గురువారం (జులై 24) రాత్రి ఫలితాలను మరోమారు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.