IBPS PO & SO Jobs 2025: బ్యాంకు ఉద్యోగార్ధులకు అలర్ట్.. ఐబీపీఎస్ పీఓ, ఎస్‌ఓ దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే..
2025 - 26 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీఓ), స్పెషలిస్ట్ ఆఫీసర్ (ఎస్‌ఓ) పోస్టుల భర్తీకి ఇటీవల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు జులై 21వ తేదీతో ముగిశాయి. అయితే ఈ గడువును పొడిగిస్తూ ఐబీపీఎస్ ప్రకటన జారీ చేసింది..

హైదరాబాద్, జులై 23: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. 2025 – 26 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీఓ), స్పెషలిస్ట్ ఆఫీసర్ (ఎస్‌ఓ) పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు జులై 21వ తేదీతో ముగిశాయి. అయితే ఈ గడువును పొడిగిస్తూ ఐబీపీఎస్ ప్రకటన జారీ చేసింది. ఐబీపీఎస్ తాజా ప్రకటన మేరకు మరో వారం రోజులు దరఖాస్తు గడువును పొడిగించింది.
దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు జులై 28, 2025వ తేదీ వరకు దరఖాస్తుకు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. నియామక పరీక్ష ద్వారా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 5,208 ప్రొబేషనరీ ఆఫీసర్లు, 1007 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు.
ఐబీపీఎస్, పీఓ, ఎస్‌ఓ పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ ఎంఫార్మసీ ప్రవేశాలకు 2025-26 ప్రత్యేక షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు కళాశాలల్లో ఎంఫార్మసీ కోర్సులకు అనుమతులు ఇంకా లభించనందున ఏపీ పీజీఈసెట్‌లో ఎంటెక్ కోర్సులకు మాత్రమే ప్రత్యేకంగా కౌన్సెలింగ్ చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి టీవీ శ్రీకృష్ణమూర్తి తెలిపారు. ఫార్మసీలో ప్రవేశాలకు సంబంధించి త్వరలోనే ప్రత్యేకంగా షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




