AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో దారుణం.. తండ్రితో కలిసి ఇంట్లోనే భర్తను హత్య చేసిన భార్యామణి!

కుటుంబంలో ఎవరు తప్పుచేసినా దానిని సరిదిద్ది సర్దుకుపోయే రోజులు పోయాయనే చెప్పాలి. ప్రస్తుత రోజుల్లో భార్యకు భర్త శత్రువుగా మారుతున్నాయి. భర్తను మూడో కంటికి తెలియకుండా భార్యే హతమారుస్తుంది. కన్న బిడ్డలను, తల్లిదండ్రులను ఏ బంధమైనా క్షణాల్లో తెంచుకునేందుకు కూడా సిద్ధపడుతున్నారు..

మరో దారుణం.. తండ్రితో కలిసి ఇంట్లోనే భర్తను హత్య చేసిన భార్యామణి!
Tandur Husband Murder Case
Srilakshmi C
|

Updated on: Jul 22, 2025 | 6:42 PM

Share

తాండూరు, జులై 22: నేటి సమాజంలో మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి. కుటుంబంలో ఎవరు తప్పుచేసినా దానిని సరిదిద్ది సర్దుకుపోయే రోజులు పోయాయనే చెప్పాలి. ప్రస్తుత రోజుల్లో భార్యకు భర్త శత్రువుగా మారుతున్నాయి. భర్తను మూడో కంటికి తెలియకుండా భార్యే హతమారుస్తుంది. కన్న బిడ్డలను, తల్లిదండ్రులను ఏ బంధమైనా క్షణాల్లో తెంచుకునేందుకు కూడా సిద్ధపడుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఇలాంటి ఉదంతాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనో మరొకటి చోటు చేసుకుంది. ఓ భార్య తండ్రితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసింది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్‌లో చోటుచేసుకుంది. తాండూరు గ్రామీణ సీఐ నగేశ్, ఎస్సై వినోద్‌రాథోడ్‌ తెలిపిన వివరాల ప్రకారం..

గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేశ్‌ (32) నాపరాయి గనుల్లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతడికి పదేళ్ల కిందట కొత్లాపూర్‌కు చెందిన జయశ్రీతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. మూడేళ్ల క్రితం జయశ్రీ భర్తతో గొడవపడి ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. నెలన్నర క్రితమే వెంకటేశ్‌ గ్రామపెద్దల సమక్షంలో చర్చించి భార్యాపిల్లలను ఇంటికి తెచ్చుకున్నాడు. తర్వాత కూడా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక భార్య.. వెంకటేశ్‌ చేతులు పట్టుకోగా, ఆమె తండ్రి పండరి అతడిని గొంతు నులిమి హతమార్చాడు. విషయం బయటకు పొక్కకుండా సోమవారం ఉదయం హతుడిని ఆసుపత్రికి తరలించేందుకు ఆటో తీసుకొచ్చారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆటో డ్రైవర్‌ నిరాకరించాడు. ఇంతలో పక్కింట్లో ఉన్న మృతుడి తల్లి, సోదరులు అక్కడికి చేరుకోగా విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తల్లి అంజిలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జయశ్రీ, పండరిలను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. ఘటనా స్థలాన్ని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.