NEET PG 2025 Evaluation: నీట్ పీజీ పరీక్ష మూల్యాంకనంపై సందేహాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్లు!
నీట్ పీజీ 2025 మూల్యాంకన ప్రక్రియపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రక్రియ పారదర్శకత లేమిపై, ప్రాథమిక కీ విడుదల లోపాలపై ఆందోళనను వ్యక్తంచేస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. వీటిని ఆగస్టు 3వ తేదీన విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మూల్యాంకన వ్యవస్థలో బహిరంగత లేకపోవడం, మార్కింగ్ ప్రక్రియలో స్పష్టంగా నిర్వచించబడిన విధానాలు లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి..

న్యూఢిల్లీ, జులై 16: మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహిచిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ పీజీ 2025 మూల్యాంకన ప్రక్రియపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రక్రియ పారదర్శకత లేమిపై, ప్రాథమిక కీ విడుదల లోపాలపై ఆందోళనను వ్యక్తంచేస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. మూల్యాంకన వ్యవస్థలో బహిరంగత లేకపోవడం, మార్కింగ్ ప్రక్రియలో స్పష్టంగా నిర్వచించబడిన విధానాలు లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని ఆగస్టు 3వ తేదీన విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. జస్టిస్ కె. వినోద్ చంద్రన్, జస్టిస్ ఎమ్.వి. అంబారియాలతో కూడిన ధర్మాసనం జులై 14న ఈ పిటిషన్లను క్లుప్తంగా విచారించింది.
అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు, సంబంధిత సమాధాన కీలను అందించాలని, మూల్యాంకనం తర్వాత సరైన, తప్పు సమాధానాల వివరాలను అందించాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు. అంతేకాదు అభ్యంతరాలు తెలిపిన వారి సమాధాన పత్రాలను తిరిగి తనిఖీ చేయడానికి లేదా తిరిగి మూల్యాంకనం చేయడానికి అనుమతించే వ్యవస్థను అమలు చేయాలని కూడా కోరుతున్నారు. ప్రస్తుత ప్రక్రియలో పారదర్శకత లేదని, ఇది పరీక్ష సమగ్రతను ప్రభావితం చేస్తుందని, అభ్యర్థుల హక్కులను దెబ్బతీస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఎస్‌ఎస్‌సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్-13 పరీక్ష షెడ్యూల్ విడుదల..
వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలోని గ్రూప్ సి, డి పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్-XIII రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి నియామక పరీక్ష షెడ్యూల్‌ను స్టాఫ్ సెలక్షన్ కమీషన్ తాజాగా విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం జులై 24, 25, 26, 28, 29, 30, 31, ఆగస్టు 1వ తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్ కింద అప్పర్ డివిజన్ క్లర్క్, డిప్యూటీ రేంజర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ప్రోగ్రామర్, ఫీల్డ్‌మ్యాన్, సీనియర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్ తదితర 2,423 పోస్టులను భర్తీ చేయనుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.








