Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag Cocaine Case: వైజాగ్‌ కొకైన్‌ డ్రగ్స్ కేసులో వెలుగులోకి డాక్టర్‌.. మూడుకు చేరిన అరెస్టులు

విశాఖపట్నంలో తీవ్ర కలకలం సృష్టించిన కొకైన్ కేసులో వెలుగులోకి వచ్చిన డాక్టర్‌ను కమ్మెళ్ల కృష్ణ చైతన్య వర్మగా గుర్తించారు. డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలు ఉన్న డాక్టర్ కమ్మెళ్ల కృష్ణ చైతన్య వర్మను విశాఖ పోలీసులు అరెస్టు చేసారు. డ్రగ్స్ మాఫియాతో డాక్టర్‌కు లింకులున్నట్టు తేల్చారు..

Vizag Cocaine Case: వైజాగ్‌ కొకైన్‌ డ్రగ్స్ కేసులో వెలుగులోకి డాక్టర్‌.. మూడుకు చేరిన అరెస్టులు
Vizag Cocaine Case
Srilakshmi C
|

Updated on: Jul 07, 2025 | 8:12 AM

Share

విశాఖపట్నం, జులై 7: విశాఖపట్నంలో కలకలం రేపిన కొకైన్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. నిందితుల కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. డ్రగ్ మాఫియాతో ఓ డాక్టర్‌కు ఉన్న లింకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు థామస్ డైరి లో కీలక సమాచారం బయటకు వచ్చింది. ప్రధాన నిందితుడు అక్షయ్ కు హైదరాబాద్ తోనూ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాదులోనూ ఉద్యోగం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో పలుమార్లు విశాఖకు అక్షయ్ డ్రగ్స్ దిగుమతి చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాఫియాతో విశాఖలో లింకులున్న మరికొంతమంది ప్రమేయంపై పోలీసులు కూపి లాగుతున్నారు.

విశాఖపట్నంలో తీవ్ర కలకలం సృష్టించిన కొకైన్ కేసులో వెలుగులోకి వచ్చిన డాక్టర్‌ను కమ్మెళ్ల కృష్ణ చైతన్య వర్మగా గుర్తించారు. డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలు ఉన్న డాక్టర్ కమ్మెళ్ల కృష్ణ చైతన్య వర్మను విశాఖ పోలీసులు అరెస్టు చేసారు. డ్రగ్స్ మాఫియాతో డాక్టర్‌కు లింకులున్నట్టు తేల్చారు. కూర్మన్నపాలెం ఏ ప్లస్ హాస్పిటల్ కు సీఈవోగా ఉన్నారు డాక్టర్ కృష్ణ చైతన్య. కొకైన్ కోసం 60 వేల రూపాయలు డాక్టర్ ఇచ్చినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. డాక్టర్ కొకైన్ కు అలవాటు పడినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. డాక్టర్ కృష్ణ చైతన్యను అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు.

దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య మూడుకు చేరింది. మరి కొంతమంది పాత్ర పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా థామస్, విశాఖకు చెందిన అక్షయ్ ని అరెస్టు చేసి. 25 గ్రాముల కొకైన్.. 3.6 లక్షల నగదు సీజ్ చేశారు. ఓ ఎలక్ట్రానిక్ వెల్డింగ్ మిషన్ తో పాటు.. కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదులో రూ.60 వేలు డాక్టర్ సమకూర్చినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితులకు ఉన్న లింకులపై ఆరా తీస్తున్నరు పోలీసులు. ఢిల్లీకి చెందిన ప్రిన్స్, బుచ్చి అనే మరో ఇద్దరు నిందితుల కోసం కొనసాగుతున్న గాలిస్తున్నారు. తాజాగా ఇన్ కేసులో డాక్టర్ పాత్ర బయటపడడంతో విశాఖలో తీవ్ర కలకలం రేపుతుంది. డ్రగ్స్ కేసులో ఎంతటి వారి పాత్ర ఉన్న ఉపేక్షించేది లేదlr అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు సబ్-డివిజన్) కె. లక్ష్మణ మూర్తి తెలిపారు. కాగా రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం EAGLEతో కలిసి నగర పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో శనివారం ఢిల్లీలో రూ.15 లక్షల విలువైన 25 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాకు చెందిన సీతమ్మధారకు చెందిన అక్షయ్ అలియాస్ మున్నా (34), ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్న థామస్ జిమోన్ (30)లను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.