ప్రేమ నిరాకరించిందని యువతిని కత్తితో పొడిచి.. మెడలో తాళికట్టి, సెల్ఫీ తీసుకుని పరార్!
తనను ప్రేమించేందుకు నిరాకరించిందని యువతిని దారుణంగా కత్తితో పొడిచంపాడో ప్రేమోన్మాది. ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలన్న ఉన్మాదంతో రక్తపు మడుగులోపడి ప్రాణాలతో విలవిలలాడుతున్న ఆమె మెడలో తాళికట్టి.. సెల్ఫీ తీసుకుని మురిసిపోయాడు. ఈ దారుణ ఘటన మైసూరులో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

మైసూరు, జులై 5: ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించేందుకు నిరాకరించిందని యువతిని దారుణంగా కత్తితో పొడిచాడు. ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలన్న ఉన్మాదంతో రక్తపు మడుగులోపడి ప్రాణాలతో విలవిలలాడుతున్న ఆమె మెడలో తాళికట్టి వికటాట్టహాసం చేశాడు. ఈ దారుణ ఘటన మైసూరులో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
మైసూరులోని పాండవపురానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ అభిషేక్ అనే యువకుడు గత కొంతకాలంగా వెంటపడసాగాడు. అయితే తనకు ఇష్టం లేదని యువతి చెప్పింది. దీంతో తనను ప్రేమించాలని, పెళ్లి కూడా చేసుకోవాలని నిత్యం ఆమెను బలవంత పెట్టసాగాడు. ఈ క్రమంలో జులై 5న (శనివారం) సాయంత్రం తనను ప్రేమించాలంటూ యువతిని మరోసారి బలవంత పెట్టాడు. ప్రేమించేందుకు యువతి నిరాకరించడంతోపాటు.. తన జోలికి రావొద్దని అభిషేక్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
దీంతో ఆగ్రహానికి గురైన అభిషేక్.. అప్పటికే తన వెంటతెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై సదరు యువతి స్పృహతప్పి పడిపోయింది. రక్తపు మడుగులో పడిఉన్న యువతి పట్ల అభిషేక్ దారుణంగా ప్రవర్తించాడు. ఆమె మెడలో తాళి కట్టి, అనంతరం సెల్ ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని మురిసిపోయాడు. ఆ తర్వాత ఆమెను తీసుకుని సమీపంలోని ఓ ఆసుపత్రికి వెళ్లాడు. యువతి పరిస్థితి విషమించడంతో అభిషేక్ అక్కడి నుంచి పరారయ్యాడు. మరోవైపు చికిత్స పొందుతూ యువతి కాసేపటికే మృతి చెందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడు అభిషేక్ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.