AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BV Pattabhiram: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు BV పట్టాభిరామ్‌ కన్నుమూత..!

ప్రముఖ వ్యక్తిత్వవికాస నిపుణులు డాక్టర్ పట్టాభి రామ్ (75) గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం (జూన్ 30) రాత్రి 9.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఇంద్రజాలకుడిగా (మెజీషియన్) తన ప్రయాణాన్ని ప్రారంభించి, కెరీర్‌లో అంచలంచెలుగా ఎదిగారు. ఆయన తన జీవితకాలంలో అనేక బెస్ట్ సెల్లింగ్ మోటివేషనల్ పుస్తకాలను రచించారు. యువతకు లెక్కకుమించి మోటివేషన్‌ స్పీచ్‌లు ఇచ్చారు..

BV Pattabhiram: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు BV పట్టాభిరామ్‌ కన్నుమూత..!
BV Pattabhiram
Srilakshmi C
|

Updated on: Jul 01, 2025 | 5:15 PM

Share

ప్రఖ్యాత హిప్నాటిస్ట్‌, సైకాలజిస్ట్‌, వ్యక్తిత్వవికాస నిపుణులు డాక్టర్ పట్టాభి రామ్ (75) గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం (జూన్ 30) రాత్రి 9.45 గంటలకు గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఇంద్రజాలకుడిగా (మెజీషియన్) తన ప్రయాణాన్ని ప్రారంభించి, కెరీర్‌లో అంచలంచెలుగా ఎదిగారు. ఆయన తన జీవితకాలంలో అనేక బెస్ట్ సెల్లింగ్ మోటివేషనల్ పుస్తకాలను రచించారు. యువతకు లెక్కకుమించి మోటివేషన్‌ స్పీచ్‌లు ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్ధులు, యువత కోసం ఆయన అహోరాత్రులు కష్టించారు. సానుకూల ఆలోచనలను రేకెత్తించడానికి, ప్రేరేపించడానికి, జీవిత సవాళ్లను అధిగమించి ఉన్నతంగా ఎదగడం.. వంటి ఎన్నో అంశాలను సృజించి ఎంతో మందికి జీవితంపై ఆశలను చిగురింపజేశారు.

డాక్టర్ పట్టాభి రామ్ భౌతికకాయాన్ని జూలై 2వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఖైరతాబాద్‌లోని ఆయన నివాసంలో సందర్శనార్థం ఉంచుతారు. ఆయన అంత్యక్రియలు జూలై 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో జరుగుతాయి. పట్టాభిరామ్కు భార్య జయ, కొడుకు ప్రశాంత్‌ ఉన్నారు. కాగా బీవీ పట్టాభిరామ్ పూర్తి పేరు.. భావరాజు వేంకట పట్టాభిరామ్‌. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రావ్ సాహెబ్ భావరాజు సత్యనారాయణ 15 మంది సంతానంలో ఒకరు. పట్టాభిరామ్‌ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నాటిస్టు, మెజీషియన్‌గా మాత్రమేకాదు ఆయన నటుడు కూడా. తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో ఎన్నో మోటివేషనల్ పుస్తకాలు రాశారు. దూరదర్శన్‌లో అనేక మేజిక్ షోలు ఇచ్చారు. 1990లలో పలు పత్రికలో ‘బాలలకు బంగారుబాట’, బాలజ్యోతి అనే బాలల పత్రికలో ‘మాయావిజ్ఞానం’ పేరిట వ్యాసాలు రాశారు. పట్టాభిరామ్‌ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు.

ఆ తర్వాత సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లలో డిగ్రీలు చేశారు. గైడెన్స్, కౌన్సిలింగ్, జర్నలిజంలో పీజీ డిప్లమా కోర్సులు సైతం చేశారు. మానసిక శాస్త్రం, ఫిలాసఫీ గైడెన్స్ కౌన్సెలింగ్, హిప్నోథెరపీలలో అమెరికా నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నారు. వ్యక్తిత్వవికాసం, సెల్ఫ్ హిప్నాటిజం వంటి అంశాలపై భారత్‌తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, అరబ్ వంటి దేశవిదేశాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించారు. హిప్నోసిస్‌పై ఆయన చేసిన కృషికిగానూ 1983లో ఫ్లోరిడా యూనివర్సిటీ డాక్టరేట్‌ ఇచ్చి గౌరవించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..