AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కమల్‌ హాసన్‌కు అభిమానుల ఊహించని గిఫ్ట్.. వేదికపైనే ఆగ్రహం! వీడియో వైరల్

కమల్‌ హాసన్‌కు సొంత పార్టీ కార్యకర్తల నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. దీంతో వేదికపై సొంత పార్టీ కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు. ఓ కార్యకర్త వేదికపైకి వచ్చి కమల్‌కు కత్తిని బహుకరించాడు. అనంతరం ఆ కత్తిని చేతితో పట్టుకుని పైకెత్తాలంటూ, ఆయన చేతికి ఇచ్చేందుకు ఒత్తిడి చేశాడు. తొలుత కూల్‌గా నిరాకరించిన కమల్‌.. ఆనక సహనం కోల్పోయారు.

కమల్‌ హాసన్‌కు అభిమానుల ఊహించని గిఫ్ట్.. వేదికపైనే ఆగ్రహం! వీడియో వైరల్
Kamal Haasan Gets Angry On Fans
Srilakshmi C
|

Updated on: Jun 16, 2025 | 12:54 PM

Share

విలక్షణ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (MIM) పార్టీ అధినేత కమల్‌ హాసన్‌కు సొంత పార్టీ కార్యకర్తల నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. దీంతో వేదికపైనే సొంత పార్టీ కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు. ఓ కార్యకర్త వేదికపైకి వచ్చి కమల్‌కు కత్తిని బహుకరించాడు. అనంతరం ఆ కత్తిని చేతితో పట్టుకుని పైకెత్తాలంటూ, ఆయన చేతికి ఇచ్చేందుకు ఒత్తిడి చేశాడు. తొలుత కూల్‌గా నిరాకరించిన కమల్‌.. కార్యకర్త ఒత్తిడి చేయడంతో సహనం కోల్పోయారు. ఈ అనూహ్య పరిణామంతో వేదికపై గందరగోళం నెలకొంది. అనంతరం అదే వేదికపై ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని సదరు వ్యక్తులను బలవంతంగా వేదిక మీద నుంచి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అసలేం జరిగిందంటే..

చెన్నైలో మక్కల్‌ నీది మయ్యం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ చీఫ్, నటుడు కమల్ హాసన్ విచ్చేశారు. తమిళనాడు నుంచి రాజ్యసభకు కమల్‌ హాసన్ ఏకగ్రీవంగా ఎన్నికైన కొద్ది రోజుల తర్వాత చెన్నైలో ఈ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. బహిరంగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం జరుగతున్న సమయంలో వేదికపైగా కొందరు కార్యకర్తలు చేరుకుని ఆయనకు ఓ భారీ కత్తిని బహూకరించారు. మొదట నవ్వుతూనే కత్తిని కమల్‌ స్వీకరించారు. అనంతరం వారు కత్తిని చేతితో పట్టుకోవాలని ఒత్తిడి చేశారు. తల అడ్డంగా ఊపుతూ సున్నితంగా తిరస్కరించడానికి ప్రయత్నించిన కమల్.. మరో కార్యకర్త కత్తిని ఒరలో నుంచి తీసి కమల్‌ చేతికి బలవంతంగా అందించబోయాడు. దీంతో సహనం కోల్పోయిన కమల్‌.. కత్తిని కిందపెట్టాలంటూ హెచ్చరించారు. ఆ తర్వాత కూడా కమల్‌ హాసన్‌తో కరచాలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు వారు ఆసక్తి చూపగా.. ఇంతలో అక్కడే ఉన్న పోలీసులు కార్యకర్తను నిలువరించి, వేదికపై నుంచి కిందకి దింపేశారు.

ఇవి కూడా చదవండి

కొద్ది నిమిషాల పాటు వేదికపై గందరగోళం నెలకొన్నప్పటికీ అనంతరం మళ్లీ యథాస్థితికి చేరుకుని, నిర్వహకులను కార్యక్రమం కొనసాగించమని కమల్‌ నవ్వుతూ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కమల్‌కు కత్తిని బహుకరిస్తే ఎందుకు కోపం వచ్చిందో? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. మనం కత్తి కాదు మన చేతిలో పుస్తకం, పెన్ను పట్టుకోవాలి. కమల్‌ ఇతరుల మాదిరిగా కత్తిని ఎత్తి ఫోటోలకు ఫోజులు ఇవ్వవచ్చు. ఆయన అలా చేయలేదు. ఆయన మంచి రాజకీయ నాయకుడు అంటే మరో నెటిజన్ కామెంట్‌ సెక్షన్‌లో పేర్కొన్నాడు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.