Safest Seat On Plane: ఫ్లైట్ జర్నీలో ఏ సీటు సేఫ్..? మీకూ ఈ డౌట్ ఉందా..
చాలా మంది విమానంలో ఏ సీటు అత్యంత సురక్షితమైనదో, ప్రమాదం జరిగితే ఏ సీటు మరణం నుంచి కాపాడుతుందో అని తెగ ఆలోచిస్తున్నారు. కాబట్టి విమానంలో ఏ సీటు అత్యంత సురక్షితమైనదో ఇక్కడ తెలుసుకుందాం. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అందించిన సమాచారం ప్రకారం.. విమానంలో ముందు భాగంలో కూర్చోవడం..

ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే విమాన ప్రయాణాన్ని సురక్షితమైన రవాణా మార్గంగా పరిగణిస్తారు. కానీ మే 12 అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇద్దరు పైలట్లు, సిబ్బందితో సహా విమానంలో ఉన్న 242 మందిలో, ఒక ప్రయాణీకుడు మినహా మిగతా అందరూ సజీవ దహనం అయ్యారు. అద్భుతంగా ప్రాణాలతో బయటపడిన వ్యక్తి కూర్చున్న సీటు నంబర్ 11A. ఇందులో కూర్చున్న ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తలుపు నుంచి బయటకు దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జనాలు చాలా మంది విమానంలో ఏ సీటు అత్యంత సురక్షితమైనదో, ప్రమాదం జరిగితే ఏ సీటు మరణం నుంచి కాపాడుతుందో అని తెగ ఆలోచిస్తున్నారు. కాబట్టి విమానంలో ఏ సీటు అత్యంత సురక్షితమైనదో ఇక్కడ తెలుసుకుందాం..
విమానంలో ఏ సీటు సురక్షితమైనదో తెలుసా?
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అందించిన సమాచారం ప్రకారం.. విమానంలో ముందు భాగంలో కూర్చోవడం కంటే వెనుక భాగంలో కూర్చోవడం సురక్షితం. ప్రమాదం జరిగితే, ముందు భాగంలో కంటే వెనుక భాగంలో కూర్చుంటే బతికే అవకాశం ఎక్కువగా ఉంటుందని నివేదిక పేర్కొంది. విమానం రెక్కల దగ్గర ఉన్న సీట్లలో ఎమర్జెన్సీ డోర్లు ఉంటాయి. ఈ సీట్లలో కూర్చోవడం కూడా చాలా సురక్షితం. ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడి నుంచి బయటపడటం చాలా సులభం. మధ్య సీట్లు కూడా చాలా సురక్షితం. విమానంలో ప్రమాదం జరిగితే, మధ్య సీట్లో కూర్చున్న ప్రయాణీకులకు రెండు వైపులా కూర్చున్న ప్రయాణీకుల మద్దతు ఉంటుంది. దీని కారణంగా వారు తక్కువ ప్రభావితమవుతారు.
వింగ్ సీట్లు అత్యవసర నిష్క్రమణకు దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రయాణీకులు అత్యవసర పరిస్థితిలో బతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, ఎమర్జెన్సీ డోరు వరుసలోని సీట్లు కూడా సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. అత్యవసర ల్యాండింగ్ లేదా ఏదైనా ఇతర అత్యవసర పరిస్థితిలో ఈ వరుసలో కూర్చున్న ప్రయాణీకులు బతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ విండో సీటు ఏ విధంగానూ సురక్షితంగా పరిగణించబడదు. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు అక్కడ తప్పించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. విమానంలో మధ్య సీటు, వెనుక సీట్లు అత్యంత సురక్షితమైనవని కొందరు నిపుణులు చెబుతున్నారు. విమానంలో వెనుక మూడవ స్థానంలో ఉన్న ప్రయాణీకుల సీట్లు అత్యంత సురక్షితమైనవట. ఇక్కడ కూర్చున్న వారు ప్రమాదంలో బతికే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
విమానం కూలిపోయినప్పుడు విమానం ముందు భాగం ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఇక్కడ కూర్చున్న వ్యక్తులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విమానం వెనుక కూర్చున్న ప్రయాణీకులు బతికే అవకాశం 69% ఎక్కువగా ఉంటుంది. విమానం మధ్యలో లేదా రెక్కల పక్కన కూర్చున్న ప్రయాణీకులు బతికే అవకాశం 59% ఎక్కువగా ఉంటుంది. ముందు కూర్చున్న ప్రయాణీకులు 49% బతికే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మొత్తంగా ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణీకులు బతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే విమాన ప్రమాదం తర్వాత బతికే అవకాశాలు ప్రమాదం రకం, తీవ్రతపై ఆధారపడి ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.