AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

498A Tea Cafe: భార్య తనపై పెట్టిన కేసు సెక్షన్ పేరుతో టీ స్టాల్.. చేతులకు బేడీలు వేసుకొని టీ అమ్ముతున్న భర్త!

భార్య తనపై పెట్టిన కేసులతో విసిగిపోయిన ఓ భర్త వినూత్న నిసరనకు దిగాడు. తనపై అన్యాయంగా వరకట్న వేధింపుల కేసు పెట్టారని ఆరోపిస్తూ.. ఈ కేసులో తనపై నమోదైన సెక్షన్‌ పేరుతో అత్తారింటి ముందు '498ఏ టీ కేఫ్' అనే టీ కొట్టును ప్రారంభించాడు. చేతులకు బేడీలు వేసుకుని టీ అమ్ముతూ, గత మూడు ఏళ్లుగా తాను అనుభవించిన బాధను, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చాడు. ఈ ఆశ్యర్యక ఘటన రాజస్థాన్‌లో అంటా జిల్లాలో వెలుగు చూసింది.

498A Tea Cafe: భార్య తనపై పెట్టిన కేసు సెక్షన్ పేరుతో టీ స్టాల్.. చేతులకు బేడీలు వేసుకొని టీ అమ్ముతున్న భర్త!
Anand T
|

Updated on: Jun 14, 2025 | 1:11 PM

Share

భార్య తనపై పెట్టిన కేసులకు నిరసనగా అత్తారింటి ముందు టీకొట్టు పెట్టి చేతులకు బేడీలు వేసుకొని ఓ భర్త టీ అమ్ముతున్న ఘటన రాజస్థాన్‌లోని అంటా జిల్లాలో వెలుగు చూసింది. వివరాళ్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన కృష్ణ కుమార్ ధాకడ్ అనే వ్యక్తికి మీనాక్షి మాలవ్‌ అనే యువతితో 2018లో వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకు ఈ దంపతులు తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. ఈ వ్యాపారంతో వీరు చుట్టుపక్కన ఉన్న మహిళలకు కూడా ఉపాధి కల్పించారు. దీంతో వీరికి మంచి గుర్తింపు వచ్చింది. అయితే కొన్ని రోజుల తర్వాత తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి పుట్టింటికి వెళ్లిపోయిందని కృష్ణ కుమార్ తెలిపారు.

అయితే ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య కొన్ని నెలల తర్వాత తన తీవ్ర ఆరోపణలు చేస్తూ వరకట్న వేధింపుల సెక్షన్ 498ఏ, సెక్షన్ 125 కింద కేసులు పెట్టిందని కృష్ణ కుమార్ తెలిపాడు. ఒక తప్పుడు కేసు వల్ల తన జీవితమంతా నాశనమైందని.. మూడేళ్లుగా తాను న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగట్లేదని భావోద్వేగానికి గురయ్యాడు. ఇక తనకు అన్యాయం చేసిన భార్యకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. భార్య తనపై పెట్టిన కేసుకు నిరసనగా అత్తారింటి ముందు ఓ టీ కొట్టును ప్రారంభించాడు.

అయితే, ఆ టీకొట్టుకు కృష్ణకుమార్ వినూత్నమైన పేరు పెట్టాడు. అదే భార్య తనపై పెట్టిన వరకట్న వేధింపుల సెక్షన్ 498 A కేఫ్ పేరుతో టీకొట్టును ప్రారంభించాడు. భార్య పెట్టిన కేసులో మూడేళ్ల పాటు తాను అనుభవించిన బాధను తెలియజేసేలా చేతులకు బేడీలు వేసుకొని టీ అమ్మడం స్టార్ట్ చేశాడు. అంతే కాకుండా టీ షాప్‌లో కొన్న బ్యానర్స్‌ కూడా ఏర్పాటు చేశాడు. తనకు న్యాయం జరిగే వరకు ఈ టీ మరుగుతూనే ఉంటుందని, 125 కింద ఎంత ఖర్చు ఇవ్వాల్సి వస్తుందో చాయ్‌ తాగుతూ చర్చించుకుందా రండి అంటూ ఉన్న నినాదాలతో కొన్ని బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశాడు. చట్టాన్ని దుర్వినియోగం చేసి తనను తప్పుడు కేసులో ఇరికించిన ప్రాంతంలో టీ అమ్ముతూ నిష్పక్షపాతంగా ఈ న్యాయపోరాటం చేయాలని తాను నిర్ణయించుకున్నట్టు కృష్ణ కుమార్ తెలిపాడు.

ఇదిలా ఉండగా ఆయన భార్య మాత్రం అతనిపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన భర్త భూమి కొనుగోలు చేసేందుకు తన తండ్రిని డబ్బు అడిగాడని.. దానికి తన తండ్రి నిరాకరించడంతో తనను వేధింపులకు గురిచేశాడని ఆమె ఆరోపించింది. అందుకే తాను తన పెట్టింటికి వెళ్లిపోయినట్టు చెప్పుకొచ్చింది. తాను కృష్ణకుమార్ నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నానని.. కానీ దానికి ముందు భర్త తన తండ్రి నుంచి ఇదువరకు తీసుకున్న అప్పులన్నీ తిరిగి ఇవ్వాలని ఆమె తెలిపింది.

మరోవైపు భార్య పెట్టిన సెక్షన్ల పేరుతో కృష్ణకుమార్ ప్రారంభించిన ‘498ఏ టీ కేఫ్’ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇతని కథ విన్న నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..