AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver: వెండి కొనుగోలు చేసేవారికి పెద్ద ఊరట.. కేంద్రం నుంచి సూపర్ న్యూస్..

బంగారం హాల్ మార్కింగ్ గురించి తెలిసిందే. బంగారం స్వచ్చతను గుర్తించేందుకు ఇది సహాయపడుతుంది. మీరు కొంటున్నది అసలు బంగారమా లేదా నకిలీదా అనేది గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు వెండి ఆభరణాలకు కూాడా హాల్ మార్కింగ్ తప్పనిసరి చేశారు. త్వరలో సంఖ్యను పెంచనున్నారు.

Silver: వెండి కొనుగోలు చేసేవారికి పెద్ద ఊరట.. కేంద్రం నుంచి సూపర్ న్యూస్..
Silver JewelleryImage Credit source: instagram
Venkatrao Lella
|

Updated on: Aug 12, 2026 | 9:15 AM

Share

బంగారం ధరలు భారీగా పెరుగుతుండటంతో కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ కొనుగోలు చేసిన తక్కువ మొత్తంలో కొంటున్నారు. తులం రూ.లక్షన్నరకు చేరుకోవడంతో బంగారం షాపుల వైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. గోల్డ్ రేట్ల పెరుగుదలతో వెండి వైపు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. వెండిని కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. దీంతో వెండికి ఇటీవల కాలంలో భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో మోసాలు, క్రమాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. నాణ్యతలేని, నకిలీ వస్తువులను విక్రయించే అవకాశముంది. దీని నుంచి కస్టమర్లను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెండి ఆభరణాలను పరీక్ష కేంద్రాలను దేశవ్యాప్తంగా మారిన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. అలాగే హాల్ మార్కింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది.

రాబోయే రెండేళ్లల్లో మరిన్ని ల్యాబ్‌లు

రాబోయే రెండేళ్లల్లో దేశవ్యాప్తంగా వెండి ఆభరణాల టెస్టింగ్ ల్యాబ్‌ల సంఖ్యను మరింత పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుది. వెండి స్వచ్చతను చెక్ చేయడం, కొనుగోలుదారులకు మరింత విశ్వాసాన్ని కలిగించేందుకు ఈ చర్యలు తీసుకుంటుంది. దేశంలో 2005 నుంచి వెండి ఆభరణాలకు హాల్ మార్కింగ్ అమలు చేస్తున్నారు. హాల్ మార్క్ చేసిన తర్వాత ప్రతీ ఆభరణానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తున్నారు. ఆ నెంబర్ ఆధారంగా కొనుగోలుదారుల తమ వెండి ఆభరణాల స్వచ్చతను తెలుసుకోవచ్చు. మీరు కొనేది అసలైనదా.. లేదా నకిలీదా అనేది గుర్తించవచ్చు. వెండి ఆభరణాలకు ఈ నెంబర్ కేటాయిస్తున్న దగ్గర నుంచి హాల్ మార్కింగ్‌కు డిమాండ్ పెరుగుతోంది. దీంతో బీఐఎస్ పరీక్ష అవసరం పెరిగింది. దీంతో ల్యాబ్‌ల సంఖ్యను మరింత విస్తరించాల్సిన అసవరం ఏర్పడింది.

వెండి ఆభరణాలకు హాల్ మార్కింగ్

2025-26 ఆర్థిక సంవత్సరం విషయానికొస్తే.. సుమారు 59 లక్షల వెండి ఆభరణాలకు హాల్‌మార్క్ చేశారు. ఇక 2024-25 ఆర్ధిక సంవత్సరంలో సుమారు 32 లక్షల వెండి ఆభరణాలకు హాల్‌మార్క్ చేసినట్లు కేంద్రం తెలిపింది. వెండి ఆభరణాలు కొనుగోలు చేసే ముందు ఎక్కువ మంది వినియోగదారులు దాని స్వచ్చత గురించి హామీ కోరుతున్నారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్ట్యా ప్రయోగశాలలను మరింత విస్తరించనున్నారు. దేశవ్యాప్తంగా వెండి ఆభరణాలను టెస్ట్ చేయడానికి ప్రస్తుతం సుమారు 230 కేంద్రాలు BIS గుర్తింపు పొందాయి. దీంతో ఇప్పుడు వీటి సంఖ్యను మరింత పెంచనున్నారు. 2014లో 147 బీఐఎస్‌ గుర్తింపు పొందిన ప్రయోగశాలలు ఉండేవి. ఈ సంఖ్య ఇప్పుడు సుమారు 440కి పెరిగింది. మరో 350 ప్రభుత్వ ప్రయోగశాలలు కూడా బీఐఎస్ ప్యానెల్‌లో భాగంగా ఉన్నాయి.

Follow Us