AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల్లించకపోతే..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026–27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి A4 రకం రిటైల్ మద్యం దుకాణాల లైసెన్స్ రెన్యూవల్ గడువును పొడిగించింది. నిజానికి సెప్టెంబర్ 21తో ముగియాల్సిన ఈ గడువును, ఆన్‌లైన్ చెల్లింపుల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల పొడిగించారు. నిర్ణీత గడువులోగా రెన్యూవల్ చేసుకోని దుకాణాల లైసెన్సులను రద్దు చేసి, లక్కీ డ్రా ద్వారా కొత్త యజమానులకు కేటాయిస్తామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ హెచ్చరించారు. వ్యాపారులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే చలానా చెల్లించాలని సూచించారు.

మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల్లించకపోతే..?
Ap Liquor Shops Renewal
Jyothi Gadda
|

Updated on: Sep 22, 2026 | 2:50 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం వ్యాపారులు, లైసెన్స్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. 2026–27 ఎక్సైజ్ సంవత్సరానికిగానూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న A4 రకం రిటైల్ మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యూవల్ గడువును పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది.

నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 21తో ముగియాల్సిన ఈ గడువును సెప్టెంబర్ 23 వరకు పొడిగించారు. ఆఖరి రోజున రాష్ట్రవ్యాప్తంగా లైసెన్స్‌దారులు ఒకేసారి ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫీజులు చెల్లించడానికి ప్రయత్నించడంతో ఎక్సైజ్ శాఖ సర్వర్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీనివల్ల బ్యాంకింగ్ లావాదేవీలు నిలిచిపోయి, చలానాలు చెల్లించలేక వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మద్యం వ్యాపారుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ చామకూరి, సాంకేతిక కారణాల వల్ల ఏ షాపు ఆగిపోకూడదనే ఉద్దేశంతో మరో రెండు రోజులు సమయం ఇచ్చారు.

మొత్తం నోటిఫై చేసిన షాపులు: 3,650

ఇవి కూడా చదవండి

ఇప్పటివరకు రెన్యూవల్ అయినవి: 2,726 షాపులు

ప్రభుత్వానికి వచ్చిన రాబడి: లైసెన్స్, అప్లికేషన్ ఫీజుల ద్వారా ఇప్పటివరకు రూ.676 కోట్లు వసూలైంది.

మొత్తం ఫీజుల రూపంలో రూ.933.44 కోట్ల డిమాండ్ ఉండగా, మిగిలిన రూ.257 కోట్లు ఈ పొడిగించిన రెండు రోజుల్లో జమ అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాల వారీగా చూస్తే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యధికంగా 95% రెన్యూవల్స్ పూర్తయ్యాయి. గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో చెల్లింపుల రేటు కొంత తక్కువగా ఉంది.

ఎక్సైజ్ శాఖ కీలక హెచ్చరిక:

ఇప్పటికే ఐటీ విభాగం సర్వర్ సమస్యలను సరిచేసినందున, వ్యాపారులు అధికారిక పోర్టల్ ద్వారా వెంటనే చలానాలు చెల్లించి రసీదు పొందవచ్చని అధికారులు తెలిపారు. అయితే, సెప్టెంబర్ 23 లోగా రెన్యూవల్ చేసుకోని దుకాణాల లైసెన్సులు రద్దవుతాయి. అలా మిగిలిపోయిన దుకాణాలను లక్కీ డ్రా నిర్వహించి నూతన యజమానులకు కేటాయిస్తామని ఎక్సైజ్ కమిషనర్ స్పష్టం చేశారు.

నూతన మద్యం విధానం అమల్లోకి వస్తున్న తరుణంలో పారదర్శకంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుంది. కాబట్టి వ్యాపారులు ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే తమ చెల్లింపులను పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..
ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..
సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!
సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?
గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు
గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు
ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!
ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!