UMANG యాప్‌ ద్వారా PF విత్‌డ్రా సెకన్లలోనే..

Venkatrao Lella

Images: Pinterest

20 Sep 2026

UMANG యాప్‌ని ఉపయోగించి మీ PFని సులువుగా విత్ డ్రా చేసుకోవచ్చు. కేవలం సెకన్లలోనే క్లెయిమ్ దాఖలు చేయవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి UMANG యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వండి.

రిజిస్టర్ చేసుకున్న నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి ఉమాంగ్ యాప్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

ఆ తర్వాత యాప్ హోమ్‌పేజీకి వెళ్లి EPFO ​​విభాగాన్ని క్లిక్ చేయాలి. అనంతరం 'ఉద్యోగి-కేంద్రీకృత సేవలు' ఆప్షన్‌పై క్లిక్ చేసి క్లెయిమ్ రిక్వెస్ట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.

UAN నెంబర్‌తో పాటు మొబైల్ నెంబర్‌కు వచ్చే OTPని నమోదు చేయాలి. ఆ తర్వాత క్లెయిమ్ ఫారమ్‌ను నింపి ఎంత విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్నారనేది నమోదు చేసుకోవాలి.

అవసరమైన వివరాలను పూరించి డబ్బు విత్‌డ్రా చేయడానికి గల కారణాన్ని తెలియజేయాలి.ఆ తర్వాత దరఖాస్తును సమర్పించాలి.

కొన్ని క్లెయిమ్స్‌కు వైద్య ధృవీకరణ పత్రం లేదా విద్యార్హత రుజువు అవసరం కావచ్చు. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

అప్లికేషన్‌ను సమర్పించిన తర్వాత మీ క్లెయిమ్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు. ఇందుకోసం ఉమాంగ్ యాప్‌లో కనిపించే 'ట్రాక్ క్లెయిమ్' స్టేటస్ ఆప్షన్ ఎంచుకోవాలి.

అక్కడ మీ క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మీ దరఖాస్తు ఏ స్థితిలో ఉందనే వివరాలు అక్కడ కనిపిస్తాయి. దాని ద్వారా డబ్బులు ఎప్పుడు పడతాయనేది తెలుసుకోవచ్చు.