అప్పుల భారం తగ్గించుకోవాలా..? ఎవ్వరు చెప్పని బెస్ట్‌ ట్రిక్‌!

September 21, 2026

Subhash

లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లులతో ఇబ్బంది పడుతున్నారా? ఆదాయం వచ్చినా డబ్బులు సరిపోవడం లేదా? కొన్ని ఆర్థిక అలవాట్లను మార్చుకోవడం ద్వారా అప్పుల భారాన్ని తగ్గించుకోవచ్చు.

లోన్లు

ప్రతి నెలా మీకు ఎంత ఆదాయం వస్తోంది? ఎంత ఖర్చు చేస్తున్నారు? అనే వివరాలను రాసుకోండి. అవసరమైన ఖర్చులు, అనవసర ఖర్చులను గుర్తించండి. ఇలా చేయడం వల్ల ఎక్కడ డబ్బు ఆదా చేయవచ్చో అర్థమవుతుంది.

ఆదాయం, ఖర్చులు

అత్యవసర ఖర్చులకు ముందుగా డబ్బు కేటాయించండి. షాపింగ్, బయట భోజనం, అవసరం లేని ఆన్‌లైన్ కొనుగోళ్లను తగ్గించండి. చిన్న చిన్న ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆదా చేయవచ్చు.

ప్రాధాన్యత

క్రెడిట్ కార్డు బకాయిలు, అధిక వడ్డీతో ఉన్న వ్యక్తిగత రుణాలు వంటి అప్పులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. వీటికి ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. ఇలా చేస్తే వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.

అధిక వడ్డీ

ప్రతి నెలా EMI చెల్లించాల్సిన తేదీని గుర్తుంచుకోండి. వీలైతే ఆటో డెబిట్ సదుపాయాన్ని ఉపయోగించండి. ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి. ఆలస్యపు చెల్లింలు వద్దు.

EMI

అనుకోని వైద్య ఖర్చులు, ఉద్యోగంలో మార్పులు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయండి. కనీసం 3 -6 నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి.

అత్యవసరం

ఇప్పటికే అప్పులు ఉన్నప్పుడు మరో రుణం తీసుకునే ముందు మీ ఆదాయం, ఖర్చులు, EMIలను పరిశీలించండి. పాత అప్పు తీర్చడానికి కొత్త అప్పు తీసుకోవడం వల్ల ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంది. 

కొత్త అప్పులు

మీకు ఉన్న అన్ని అప్పుల వివరాలు, వడ్డీ రేట్లు, EMIలు, చెల్లింపు తేదీలను ఒకచోట రాసుకోండి. ప్రతి నెలా ఎంత మొత్తాన్ని అప్పుల చెల్లింపులకు కేటాయించాలో ముందుగానే నిర్ణయించుకోండి. 

రుణ చెల్లింపు