AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టూత్ బ్రష్‌పై ఎంత పేస్ట్‌ వేస్తున్నారో గమనిస్తున్నారా? ఇలా చేశారో చిక్కులు తప్పవు

చాలా మంది ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే నిద్ర మత్తులో చాలా మంది బ్రష్‌పై ఎంత టూత్‌పేస్ట్ వేస్తున్నారో అస్సలు శ్రద్ధపెట్టరు. కొంత మంది టూత్ బ్రష్ పెద్దదిగా ఉంటే ఎక్కువ టూత్‌పేస్ట్ తీసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది టూత్‌పేస్ట్ రుచిగా లేదని, నురుగు రాదని తక్కువ టూత్‌పేస్ట్ తీసుకుంటూ ఉంటారు..

టూత్ బ్రష్‌పై ఎంత పేస్ట్‌ వేస్తున్నారో గమనిస్తున్నారా? ఇలా చేశారో చిక్కులు తప్పవు
Brushing Tips
Srilakshmi C
|

Updated on: Jun 14, 2025 | 1:15 PM

Share

పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ ఉదయం నిద్ర లేచిన వెంటనే బ్రష్‌ చేయడం అలవాటు. అయితే నిద్ర మత్తులో చాలా మంది బ్రష్‌పై ఎంత టూత్‌పేస్ట్ వేస్తున్నారో అస్సలు శ్రద్ధపెట్టరు. కొంత మంది టూత్ బ్రష్ పెద్దదిగా ఉంటే ఎక్కువ టూత్‌పేస్ట్ తీసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది టూత్‌పేస్ట్ రుచిగా లేదని, నురుగు రాదని తక్కువ టూత్‌పేస్ట్ తీసుకుంటూ ఉంటారు. నిజానికి, చాలా మందికి ఎంత టూత్‌పేస్ట్ ఉపయోగించాలో తెలియకపోవడం దంతాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల దంతాల పై పొర దెబ్బతింటుంది. 3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల నోటిని శుభ్రం చేయడానికి ఎంత టూత్‌పేస్ట్ తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ఎంత టూత్‌పేస్ట్ తీసుకోవాలి అనే విషయాలు నిపుణుల మాటల్లో మీ కోసం..

దంతాలను శుభ్రం చేసుకోవడానికి సరైన మొత్తంలో టూత్‌పేస్ట్ వాడాలి. టూత్‌పేస్ట్‌ను 3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు నోరు శుభ్రం చేసుకోవడానికి చిన్న బియ్యం గింజ పరిమాణంలో టూత్‌పేస్ట్ వాడాలి. 3 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు, ఇతరులు దంతాలను శుభ్రం చేసుకోవడానికి బఠానీ పరిమాణంలో టూత్‌పేస్ట్ వాడాలి. దీని కంటే ఎక్కువ టూత్‌పేస్ట్ వాడవలసిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి
  • నోటి పరిశుభ్రతను కాపాడుకోవడానికి, రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం ముఖ్యం. ఉదయం అల్పాహారం ముందు, రాత్రి భోజనం తర్వాత తప్పక బ్రస్‌ చేసుకోవాలి.
  • దంతాలతో పాటు నాలుకను కూడా శుభ్రం చేసుకోవడం ముఖ్యం. టంగ్ క్లీనర్ తో గీకి శుభ్రం చేసుకోవాలి.
  • మౌత్ వాష్ వాడాలి. మౌత్ వాష్ వాడటం వల్ల దంతాల మధ్య చిక్కుకున్న మురికి, నోటి నుంచి వచ్చే దుర్వాసన పూర్తిగా తొలగిపోతాయి.
  • దంతాలను బలంగా, తెల్లగా మార్చడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని
  • తీసుకోవాలి. క్యారెట్లు తినడం వల్ల ఫలకం తొలగించడంలో సహాయపడుతుంది. కార్బోనేటేడ్ పానీయాలు దంతాల రంగును మార్చగలవు.
  • పైగా ఎనామిల్‌ను కూడా దెబ్బతీస్తాయి. రోజంతా పుష్కలంగా నీళ్లు తాగుతూ ఉండాలి. ఇది నోటిలో మురికి పేరుకుపోకుండా నిరోధిస్తుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.