AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాళ్లవల్లే నేను సినిమాల్లోకి రావడం లేదు.. అసలు విషయం చెప్పిన పవన్ కళ్యాణ్ హీరోయిన్

ఒకానొక సమయంలో సినిమాల్లో రాణించి ఆతర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నటించిన ఈ చిన్నది.. ఇప్పుడు పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. తాజాగా సినిమాలకు ఎందుకు గుడ్ బై చెప్పారు అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

వాళ్లవల్లే నేను సినిమాల్లోకి రావడం లేదు.. అసలు విషయం చెప్పిన పవన్ కళ్యాణ్ హీరోయిన్
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Jun 16, 2025 | 2:24 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అందాల భామలు కొన్ని సినిమాలేక పరిమితం అవుతున్నారు. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది భామలు నాలుగు ఐదు సినిమాలు చేసి ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ సినిమాలు మానేసి పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు. దాంతో అభిమానులు ఈ ముద్దుగుమ్మల కోసం సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఇప్పుడు ఓ చిన్నదాని కోసం నెటిజన్స్ గూగుల్ లో తెగ గాలిస్తున్నారు. ఇంతకూ ఆ భామ ఎవరో తెలుసా.? తెలుగులో ఈ బ్యూటీ చేసింది ఎనిమిది సినిమాలు కానీ హిట్ అయ్యింది మాత్రం ఒకే ఒక్క సినిమా. అందంలో ఈ అమ్మడు అప్సరస.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భారీ హిట్ అందుకుంది. సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామకు తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది.

అందం, అభినయం ఉన్నా కూడా సక్సెస్ సాధించలేకపోయింది ఈ బ్యూటీ. హీరోయిన్ గా చేసింది, సెకండ్ హీరోయిన్ గాను చేసింది అయినా కూడా ఆమెకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. ఇంతకూ ఆమె ఎవరో కాదు టాలీవుడ్ బాపు బొమ్మ ప్రణీత సుభాష్. తన క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రణీత సుభాష్ కు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ అమ్మడు. హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

హీరోయిన్ గా అనుకున్నంత గుర్తింపు సొంతం చేసుకోలేదు. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. అయినా కూడా అంతగా సక్సెస్ సాధించలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాతో భారీ హిట్ అందుకుంది. కానీ అంతగా అవకాశాలు రాలేదు. తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, హలో గురు ప్రేమకోసమే, బ్రహ్మోత్సవం సినిమాల్లో నటించింది. ఇక కెరీర్ పీక్ లో ఉండగానే.. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఈ చిన్నది అభిమానులతో ముచ్చటించింది. ఓ నెటిజన్ మీరు సినిమాల్లో ఎందుకు నటించడం లేదు అని అడిగాడు. దానికి ప్రణీత నా పిల్లల వల్లే నేను సినిమాల్లో నటించడం లేదు అని చెప్పింది. వాళ్ళను చూసుకోవడానికి సినిమాలకు దూరంగా ఉంటున్నా అని తెలిపింది ప్రణీత సుభాష్. దీని పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే