AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేంది మావ..! ఈ నటుడి భార్య టాలీవుడ్ స్టార్ హీరోయినా..!! బాలయ్యతో కలిసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది

సినిమా ఇండస్ట్రీలో ఒకానొక టైం లో హీరోగా రాణించాడు.. ఆయన పేరు రాంకీ.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు ఆయన. ముఖ్యంగా సిందూర పువ్వు సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు . ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు రాంకీ

ఇదేంది మావ..! ఈ నటుడి భార్య టాలీవుడ్ స్టార్ హీరోయినా..!! బాలయ్యతో కలిసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Jun 15, 2025 | 11:01 AM

Share

ఒకప్పుడు హీరోలుగా చేసిన చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్స్ గా రాణిస్తున్నారు. అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ జగపతి బాబు , శ్రీకాంత్.. ఇలా ఇంకొంతమంది కూడా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తున్నారు. అలాంటి వారిలో రాంకీ ఒకరు. ఈ నటుడి పూర్తి పేరు రామకృష్ణ. కాగా రాంకీగా పాపులర్ అయ్యారు. రాంకీ తెలుగు, తమిళ్ భాషల్లో నటించి మెప్పించాడు. గతంలో రాంకీ హీరోగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేసిన రాంకీ.. తెలుగులో సంఘటన, భలే ఖైదీలు, దోషి, ఒసేయ్ రాములమ్మ, రౌడీ దర్బార్, ఆకతాయి వంటి సినిమాలు చేశారు. అలాగే తమిళ్ లో ఆయన నటించిన సెంథూర పూవే సినిమా తెలుగులో సిందూర పువ్వు అనే టైటిల్ తో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

ఒకప్పుడు హీరోగా రాణించిన రాంకీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. 2018లో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరో గాడ్ ఫాదర్ గా కనిపించి మెప్పించాడు రాంకీ. ఆర్ఎక్స్ 100 సినిమాలో ఆయన పాత్ర చాలా ప్రధానంగా ఉంటుంది. ఆతర్వాత మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాలో హారో ఫ్రెండ్ గా కనిపించాడు. ఆతర్వాత కస్టడీ సినిమాతో పాటు లేటెస్ట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ సినిమాలోనూ నటించి మెప్పించాడు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ స్టార్ నటుడి భార్య గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. రాంకీ భార్య కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్.. ఆమే నిరోషా. శ్రీలంకలో జన్మించిన నిరోషా పలు తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగులో నారీ నారీ నడుమ మురారి, మహాజనానికి మరదలు పిల్ల, స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ ఇలా పలు సినిమాలు చేసింది. కాగా రాంకీ నిరోషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం వీరు రహస్యంగా కలిసి ఉన్నారు. ఆతర్వాత ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని వీరి బంధువులు మీడియాకు తెలిపారు. కాగా నిరోషా.. సీనియర్ హీరోయిన్ రాధికకు సిస్టర్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..