AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridevi : ఆ డైరెక్టర్ నన్ను ముంబైకి రమ్మన్నాడు.. నాకు భయమేసింది: కోర్ట్ మూవీ జాబిల్లి

మొదటి సినిమాతోనే హిట్ అందుకోవాలంటే ఎంతో అదృష్టముండాలి. అందరికీ ఇది సాధ్యం కాదు. అయితే ఎంట్రీ సినిమాతోనే అదరగొట్టేసింది శ్రీదేవి అప్పాల. కాకినాడకు చెందిన ఈ అమ్మాయి సోషల్ మీడియా రీల్స్ తో బాగా ఫేమస్ అయ్యింది. ఆమె ట్యాలెంట్ ను గమనించిన కోర్టు సినిమా డైరెక్టర్ రామ్ జగదీష్ కోర్టు సినిమా ఆడిషన్స్ కు పిలిచాడు. అక్కడ కూడా శ్రీదేవి తన ట్యాలెంట్ తో డైరెక్టర్ ను మెప్పించి కోర్టు సినిమా సెట్ లోకి అడుగు పెట్టింది

Sridevi : ఆ డైరెక్టర్ నన్ను ముంబైకి రమ్మన్నాడు.. నాకు భయమేసింది:  కోర్ట్ మూవీ జాబిల్లి
Sridevi
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2025 | 12:11 PM

Share

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా కోర్ట్.. ఫోక్సో చట్టం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు రామ్ జగదీష్ తొలిసారి దర్శకత్వం వహించారు. నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో ప్రశాంతి తిపిర్నేనితో కలిసి నిర్మించారు. ప్రియదర్శి పులికొండ, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. నాని బ్యానర్‌లో వచ్చిన “ఆ!”, “హిట్ 1”, “హిట్ 2” వంటి సినిమాల మాదిరిగానే, “కోర్ట్” కూడా కంటెంట్ బేస్డ్ మూవీగా పేరు తెచ్చుకుంది.  కాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన హర్ష్ రోషన్ చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. ఇక కోర్ట్ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు రోషన్ .

అలాగే ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించిన శ్రీదేవి కూడా తన నటనతో పేక్షకులను కట్టిపడేసింది. తొలి సినిమా అయినా ఈ చిన్నది.. చక్కటి అభినయాన్ని కనబరిచింది. శ్రీదేవి ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతూ ఈ సినిమాలో నటించడం విశేషం. కోర్ట్ సినిమా తర్వాత ఈ చిన్నది పలు టీవీ షోల్లో, గేమ్ షోల్లో పాల్గొంటూ సందడి చేస్తుంది. ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తూ శ్రీదేవి హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. కాగా శ్రీదేవి తనకు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని తెలిపింది.

శ్రీదేవి మాట్లాడుతూ.. ఓ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనకు ఆఫర్ ఇచ్చాడని తెలిపింది. ఒక బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనకు ఓ పాట పడాలని చెప్పాడట.. ఒక కవర్ సాంగ్ తనతో కలిసి పడాలని చెప్పాడట. అందుకోసం ముంబై రావాలి అని చెప్పడంతో తాను భయపడ్డాను అని తెలిపింది. షూట్ కోసం ముంబై రావాలి అని చెప్పడంతో తాను భయపడిపోయానని.. తాను వెళ్ళలేదు అని చెప్పుకొచ్చింది శ్రీదేవి. ఇక కోర్ట్ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ చిన్నదానికి టాలీవుడ్ లో మంచి ఆఫర్ వస్తున్నాయని తెలుస్తుంది.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..