AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లవ్వ్యూ బచ్చే..! ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కుర్ర బ్యూటీ.. కంచరపాలెం చిన్నది ఎంత మారిపోయింది.!!

చాలా మంది హీరోయిన్స్ చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ఎంతో మంది నటీనటులు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి అలరించారు. ఇక వరుస చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు హీరోహీరోయిన్లుగా వెండితెరపై సత్తా చాటుతున్నారు.

లవ్వ్యూ బచ్చే..! ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కుర్ర బ్యూటీ.. కంచరపాలెం చిన్నది ఎంత మారిపోయింది.!!
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2025 | 11:36 AM

Share

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్ గా నిలుస్తుంటాయి. అంతే కాదు ఆ సినిమాలు ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ మిగిలిపోతుంటాయి. అలాంటి సినిమాల్లో కేరాఫ్ కంచరపాలెం సినిమా ఒకటి. వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందమైన కథతో వెంకటేష్ మహా అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఒక మనిషి జీవితంలో జరిగిన సంఘటనలను దశల వారీగా ఈ సినిమాలో చూపించి ఆకట్టుకున్నాడు దర్శకుడు. ఈ సినిమాలో చూపించిన సంఘటనల్లో ఒక్కటైనా మన జీవితంలోనూ ఎదురై ఉంటుంది. ఇక కంచరపాలెం సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు గుర్తున్నారా..? చక్కటి నటనతో ఆకట్టుకున్నారు అందరూ. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నది కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

క్యూట్ నటనతో ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది ఆ చిన్నది. పై ఫోటోలకనిపిస్తున్న చిన్నారి పేరు నిత్యా శ్రీ.. కంచెరపాలెం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నిత్యా. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది నిత్యా. మొన్నమధ్య ధనుష్ నటించిన సార్ సినిమాలో కనిపించింది. ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఈ అమ్మడు చాలా అందంగా మారింది.

హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది నిత్యా. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు. రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటిస్తుంది ఈ చిన్నారి. అలాగే క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇటీవలే ఓ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తుంది. తాజాగా ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!
ఐపీఎల్ తోపులకు మొండిచేయి.. దేశవాళీ హీరోలకే జై కొట్టని గంభీర్
ఐపీఎల్ తోపులకు మొండిచేయి.. దేశవాళీ హీరోలకే జై కొట్టని గంభీర్
హాస్పిటల్స్ ఖర్చులు లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సమోసాలు
హాస్పిటల్స్ ఖర్చులు లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సమోసాలు
జీతం రాగానే అయిపోతోందా? డబ్బు ఆదా చేయడానికి స్మార్ట్ టిప్స్!
జీతం రాగానే అయిపోతోందా? డబ్బు ఆదా చేయడానికి స్మార్ట్ టిప్స్!
కాల్షియం, ప్రోటీన్ డ్రింక్.. వేసవి దాహాన్ని ఇట్టే తీరుస్తుంది..
కాల్షియం, ప్రోటీన్ డ్రింక్.. వేసవి దాహాన్ని ఇట్టే తీరుస్తుంది..
మెడపై ఉన్న మొండి నలుపు మాయం అవ్వడం ఖాయం.. ఇలా చేయండి!
మెడపై ఉన్న మొండి నలుపు మాయం అవ్వడం ఖాయం.. ఇలా చేయండి!
వారి అకౌంట్లోకి రూ.20 వేలు.. స్టేటస్ చెక్ చేస్కోండిలా..
వారి అకౌంట్లోకి రూ.20 వేలు.. స్టేటస్ చెక్ చేస్కోండిలా..
ఇక దశ తిరిగినట్టే..! దిగ్బల యోగంతో వారికి ఉన్నత జీవితం పక్కా..!
ఇక దశ తిరిగినట్టే..! దిగ్బల యోగంతో వారికి ఉన్నత జీవితం పక్కా..!
మీ లైఫ్‌ను టర్న్ చేసే బెస్ట్ మోటివేషనల్ టిప్స్ ఇవి!
మీ లైఫ్‌ను టర్న్ చేసే బెస్ట్ మోటివేషనల్ టిప్స్ ఇవి!