Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్ళై 20 ఏళ్లు.. పిల్లలు లేరు.. ఆమె భర్త చెప్పిన కారణం వింటే షాక్ అవ్వాల్సిందే

ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తమ అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పి ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉంటున్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో గడుపుతున్నారు..

పెళ్ళై 20 ఏళ్లు.. పిల్లలు లేరు.. ఆమె భర్త చెప్పిన కారణం వింటే షాక్ అవ్వాల్సిందే
Anjala Zaveri
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2025 | 12:29 PM

Share

తెలుగు ఇండస్ట్రీలోకి చాలా మంది ముద్దుగుమ్మలు పరిచయం అయ్యారు. ఒకప్పుడు ఎంతో మంది హీరోయిన్స్ టాలీవుడ్ ను ఏలారు. ఇప్పుడున్న హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలు చేసి మాయం అవుతున్నారు. కొంతమంది ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోతున్నారు. ఇక ఒకప్పుడు తన అందం.. అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ అంజలా జవేరి. ఈ ముద్దుగుమ్మ తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. కాగా అంజలిని టాలీవుడ్‌కు పరిచయం చేసింది విక్టరీ వెంకటేష్. వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా.. సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది అంజలా. అప్పటిలో ఈ అమ్మడు యూత్ ఆరాధ్య దేవత.

తెలుగులో ఈ అమ్మడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అప్పటి జనరేషన్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది అంజలా. వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా.. దేవి పుత్రుడు, నాగార్జునతో చందమామ రావే, చిరంజీవితో చూడాలని ఉంది, బాలకృష్ణతో నరసింహనాయుడు.. భలేవాడివి బాసులాంటి సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది.

ఇక అంజలా జవేరి తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది. ఆ తర్వాత తిరిగి తెలుగులో ప్రేమ సందడి, ఆప్తుడు సినిమాలు చేసింది. ఆలాగే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. వీటితో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలోను మెరిసింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది అంజలా జవేరి. అయితే ఈ అమ్మడు ఇప్పటికి కూడా అదే అందంతో కళ్లు చెదిరేలా ఉంది. అయితే ఆమె భర్త గురించి చాలా మందికి తెలియక పోవచ్చు. అంజలా జవేరి భర్త టాలీవుడ్ నటుడే..అతని పేరు తరుణ్ అరోరా..అంజలా, తరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమాలో విలన్ గా చేశాడు. జయ జానకీ నాయకా, కాటమ రాయుడు, అమర్ అక్బర్ ఆంటోనీ, అర్జున్ సురవరం వంటి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు తరుణ్ అరోరా. తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు ఈ స్టైలిష్ విలన్.  నేడు తరుణ్ పుట్టిన రోజు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమకు పెళ్ళై 20ఏళ్లు అవుతున్నా పిల్లలు లేకపోవడం గురించి తెలిపాడు. చాలామంది వారి మధ్య మరింత ప్రేమ,బాండింగ్ పెరగడానికి పిల్లల్ని కంటూ ఉంటారు. కానీ మాది పెద్దల కుదిర్చిన పెళ్లి కాదు. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా మధ్య ఎప్పటికీ ఆ ప్రేమ ఉంటుంది. అందుకే మేము పిల్లల్ని కనాలనుకోలేదు, ఇక పై కూడా కనకూడదని నిర్ణయించుకున్నాం అని చెప్పుకొచ్చాడు. కాగా అంజలా జవేరి, తరుణ్ అరోరాకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి భర్తను చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.