AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్ ఇండియా విమానంలో మంచు లక్ష్మీ.. నేను సేఫ్ అంటూ వీడియో విడుదల చేసిన నటి

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా AI 171 విమానం రన్‌వే నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్‌ పోర్ట్ సమీపంలోని బీజె మెడికల్ కాలేజ్‌ బిడ్జింగ్‌ను ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా 241 మంది మరణించారని అహ్మదాబాద్‌ సీపీ తెలిపారు.

ఎయిర్ ఇండియా విమానంలో మంచు లక్ష్మీ.. నేను సేఫ్ అంటూ వీడియో విడుదల చేసిన నటి
Manchu Lakshmi
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2025 | 11:01 AM

Share

జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం AI171 అహ్మదాబాద్‌లో ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతుండగా ప్రమాదానికి గురైంది. వాతావరణం కూడా పూర్తి అనుకూలంగా ఉంది. సరిగ్గా టేకాఫ్ అవుతున్నట్లు కనిపించిన విమానం కొంచెం ఎత్తుకు చేరుకున్న తర్వాత  ఊహించని విధంగా ప్రమాదానికి గురయ్యింది. ఈ విమాన ప్రమాదం యావత్‌ దేశాన్ని.. కాదు కాదు మొత్తం ప్రపంచాన్ని బాధలో ముంచేసింది. ఈ ప్రమాదంలో 241 మంది విమానంలో ఉన్నవాళ్లు, అలాగే విమానం కూలిన ప్రాంతంలో ఉన్న మరికొంత మంది మరణించారు.

గురువారం మధ్యాహ్నం ఆహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తున్న బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ (AI171) విమానం మేఘనాని నగర్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోకి కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఒక ప్రయాణీకుడు మాత్రమే అదృష్టవశాత్తు బయటపడ్డాడు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ విమానంలో నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా తన కూతురితో కలిసి ప్రయాణించారనీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ వార్తల పై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో విడుదల చేసింది. ఈ మేరకు ఆమె ఇన్ స్టా స్టోరీలో వీడియో షేర్ చేసింది.  నేను అందరికి పర్సనల్ గా మెసేజ్ చేశాను.. అలాగే స్టోరీ కూడా పంపించా.. నేను నా కూతురు సేఫ్ గా ల్యాండ్ అయ్యాం. తాను కూడా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేశానని తెలిపిన మంచు లక్ష్మీ.. తాను లండన్ వెళ్లలేదని.. ముంబై వెళ్ళాను అని తెలిపారు. ఈ విషయం పై చాలా మంది తనకు ఫోన్ లు, మెసేజ్ లు చేశారని.. మీ అందరి ప్రేమ వల్ల నేను, నా కూతురు క్షేమంగా ఉన్నాం అని తెలిపింది మంచు లక్ష్మీ. విమాన ప్రమాదం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంచు లక్ష్మీ. విమాన ప్రమాదం గురించి ఊహించుకుంటేనే భయంగా ఉంది అన్నారు లక్ష్మీ.  కాగా ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మందితో సహా 265 మంది మరణించారు. విమాన ప్రమాదంలో గాయపడిన వారిని ప్రధాని మోడీ కలిశారు. విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఆరుగురిని గుర్తించిన తర్వాత, మృతదేహాలను వారి వారి కుటుంబాలకు అప్పగించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌